టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా , సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ నటీనటులు గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1’ చిత్రం “11:11” ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు టైగర్ హిల్స్ ప్రొడక్షన్, బ్యానర్ ను, మరియు చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ..ఈ రోజు చాలా మంచి రోజు. నా మరో సినిమా ‘బోలా శంకర్’ కూడా ఈ రోజు ప్రారంభం కాబడింది. నిన్న అర్ధ రాత్రి వరకు కూడా నేను కోటి గారు ఇంట్లోనే షూటింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటి గారు. ఎందుకంటే కోటి తో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతో ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని సంగీతం అందించాడు.ముఖ్యంగా చెప్పాలంటే నా విజయానికి,నా ఎదుగుదలకి సింహభాగం రాజ్ – కోటి లదే అని చెప్పాలి. ఇద్దరు కూడా నా సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను ప్రత్యేకంగా 80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు, లాంటి సినిమాలు 12 వరకు చేయడం జరిగింది. సుమారు 60 సాంగ్స్ అంటే నాకు 90% సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు.
ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చినటువంటి కోటి గారి ఋణం తీర్చుకోలేక పోయానే అనే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటి గారి కొడుకు రాజీవ్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేసింది.కోటి గారి ఋణం ను ఇలా తీర్చుకోవడానికి ఈ వేడుక నాకు వేదిక అయింది. సాలూరు రాజేశ్వరరావు గారు ఎంతో గొప్ప లెజెండరీ సంగీత దర్శకుడు తన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చిన కోటి గారు కూడా తండ్రి బాటలో పయనించి సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాడు. ఈ రోజుకి కూడా తనంటే నాకు ఇన్స్పిరేషన్. చాలామంది తెరమరు గవుతున్నా..తను మాత్రం బుల్లితెరపై కూడా తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగిస్తూ.. కాంటెంపరరీ గా ఉంటూ ఔత్సాహికులను ఉత్సాహపరుస్తూ తను మంచి మనసుతో ముందుకు వెళ్తున్నారు.
అతనిలో ఉన్న పాజిటివ్ నెస్ తనని ముందుకు నడిపిస్తుంది తన ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా తను ప్లాన్ చేసుకున్నాడు.. ఈనాడు సినిమా ఇండస్ట్రీ వండర్ఫుల్ ఇండస్ట్రీ కొత్త వాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే నేను గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తాను. సినీ కళామ తల్లిని నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా చెడిపోలేదు. వచ్చిన వారంతా కూడా మొదటగా కష్టాన్ని నమ్ముకుని పని చేస్తూ నిజాయితీగా ఉండాలి. అలా ఉన్న వారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది.అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇండస్ట్రీ లో జయాపజయాలు అనేవి సహజం వాటిని పక్కన పెట్టి మన కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్ గా పనిచేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు.
సినీ ఇండస్ట్రీకు కొత్త తరం రావాలి. వచ్చి ఇండస్ట్రీలో మాలాంటి పెద్దల ఎక్స్పీరియన్స్ తో సలహాలు తీసుకోవాలి ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రెస్ గా సాగి పోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాజీవ్ కు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ నివ్వాలి. అలాగే రాజ్ గారి అబ్బాయి సాగర్ కు కూడా ఈ సినిమా లో అవకాశం కల్పించడం జరిగింది. సాగర్ కూడా తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కూడా లాభాపేక్ష లేకుండా ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కు రావడం చాలా గ్రేట్ నెస్ .వారి కోరిక, ప్రకారం ఈ సినిమాతో పాటు తను పెట్టిన టైగర్ హిల్స్ ప్రొడక్షన్ కూడా గొప్ప విజయం సాధించి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు కిట్టు గారికి , హీరోయిన్ వర్ష లకు ఈ సినిమా ద్వారా గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ చిత్ర యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
కోటి గారు మాట్లాడుతూ.. నేను చక్రవర్తి గారి శిష్యుడుగా రాజ్ కోటి గా మీ అందరి కోటిగా ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నేను సాలూరు రాజేశ్వరరావు కొడుకైనందుకు చాలా గర్వంగా ఉంది.నేను ఫస్ట్ టైం ఇటువంటి పెద్ద ఈవెంట్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. మా అయ్యప్ప చిరంజీవి గారు ఎంత బిజీగా ఉన్నా కూడా మా రాజీవ్ ని బ్లెస్సింగ్ ఇవ్వడానికి చిరంజీవి గారు రావడం అది కూడా అయ్యప్ప మాల లో రావడం మా రాజీవ్ అదృష్టమని భావిస్తున్నాను. ఎంతో క్రమశిక్షణతో చిత్తశుద్ధితో చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవలను అందించారు సాలూరు రాజేశ్వరరావు గారి తనయుడు గా అదే కోవలో నేను కూడా అదే క్రమశిక్షణతో చిత్తశుద్ధితో అంకితభావంతో చలన చిత్ర పరిశ్రమకు సేవలను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే కోవలో మరి మా రాజీవ్ కూడా చలనచిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలతో చక్కగా రాణిస్తూ. అన్ని విధాలుగా వారికి కోపరేట్ చేస్తూ పని చేయాలని మా నాన్న గారి ఆశీస్సులతోటి ,తాత గారి ఆశీస్సులతో మంచి కళాకారుడు అవుతాడని భావిస్తున్నాను.
చిరంజీవి గారు మహా మనిషి, మంచి మనిషి, నృత్యకారుడు కూడా.. అలాంటి వారితో నాకు అనుబంధం ఉండటం ఎంతో ఆనందంగా ఉంది.నేను మొదటగా చక్రవర్తి గారి శిష్యుడుగా ఉన్నపుడు నాకు చిరంజీవి గారితో వర్క్ చేసే అవకాశం వస్తే చాలా మంచి పాటలు ఇవ్వాలని అనుకునేవాన్ని అలా నాకు మొదటగా “యముడికి మొగుడు” సినిమాలో అవకాశం రావడం జరిగింది. అప్పుడు ఆయన ప్రోత్సాహం మరువలేనిది, అలా అందరి ప్రోత్సాహంతో మేము ఈరోజు ఇంత స్థాయికి రావడం జరిగింది .అలాగే మా రాజీవ్ కూడా మంచి నటుడుగా రాణించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. అలాగే మణిశర్మ గొప్ప సంగీత దర్శకుడు తను ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చాడు.నేను తనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
చిత్ర నిర్మాత వీరేశ్ (బళ్లారి )మాట్లాడుతూ .. తెలుగు సినిమా అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు.తనంటే నాకు చాలా ఇష్టం. కష్టపడితే ఏదైనా సాధించగలం అనే దానికి మెగాస్టార్ చిరంజీవి గారు నిదర్శనం.తను ఎంతో బిజీ షెడ్యూల్ వున్నా కూడా మా బ్యానర్ ను,చిత్రాన్ని ఆశీర్వదించదానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాకు మంచి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుదు మణిశర్మ గారికి నా ధన్యవాదాలు. ఇకనుండి తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ఆన్నారు.
చిత్ర దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ ..ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ లభించడం మా అదృష్టం.. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుంది. ఈ చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని అన్నారు.మా చిత్ర నిర్మాత ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు.థ్రిల్లర్ జోనర్ లి వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
హీరో రాజీవ్ సాలూరు మాట్లాడుతూ .. చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ మా చిన్న ఈవెంట్ కు వచ్చి మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ. ..రాజీవ్ కి ఈ సినిమా మంచి లైఫ్ ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కంటెంట్ ఓరియంట్ సబ్జెక్టు ఫిలిమ్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో అలాగే ఈ సినిమా కూడా థియేటర్లో గాని ఓటీటీలలో గాని అన్ని ప్లాట్ ఫామ్ లలో కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇది థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు అందరూ ఫీల్ ఎంగేజ్ అవుతారు. దర్శకుడు స్క్రీన్ ప్లే నటీనటుల పెర్ఫార్మెన్స్ లెజెండ్రీ మణి శర్మ గారు గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ చిత్ర యూనిట్ అందరికీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అన్నారు
నటుడు రోహిత్ మాట్లాడుతూ .. ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాను ఒక పెద్ద రేంజ్ సినిమా లాగా తీశారు.వీరు ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలు తీయాలని అలాగే పెద్ద హీరోలతో కూడా సినిమాలు తీసి ఈ ప్రొడక్షన్ హౌస్ పెద్ద బ్యానర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఇంత మంచి సినిమాలో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు
హీరోయిన్ వర్షా విశ్వనాథ్ మాట్లాడుతూ..మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చి నందుకు ధన్యవాదాలు.ఇంత పెద్ద సీనియర్ నటుల మధ్య నేను సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు .
విలన్ గా నటించిన సదన్ గారు మాట్లాడుతూ ..ఈ సినిమా లో నేను విలన్ గా చేయగలనని అని నన్ను నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చిన ఆర్కే గారికి నా ధన్యవాదాలు. నిర్మాత వీరేష్ గారు చాలా మంచి వ్యక్తి తను ఈ చిత్రాన్ని నిర్మిస్తూ..మాకు ధైర్యం చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!