చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడుకలు .. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈరోజు అంటే జనవరి 29న మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గారి పుట్టినరోజు. దీంతో కొణిదెల ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆమె పుట్టినరోజు వేడుకను .. ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యాడు. మెగాబ్రదర్స్ కలిసి తన తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.’ మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు.

జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ… Happy Birthday అమ్మ !! ‘ చిరంజీవి తన ట్విట్టర్లో షేర్ చేశారు. చిరంజీవిని అంజనా దేవి గారు శంకర బాబు అని పిలుస్తారు. నాగేంద్ర బాబును నాగ బాబు అని .. పవన్ కళ్యాణ్ ను కళ్యాణ్ బాబు అని అంజనా దేవి గారు తన పిల్లలను పిలుస్తుంటారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి అంజనా దేవి గారి పుట్టినరోజు వేడుకల ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus