మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్ర షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్, నాగబాబు ‘జనసేన’ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి కూడా ఎన్నికల్లో ప్రచారానికి రెడీ అవుతున్నారట. అయితే ‘జనసేన’ పార్టీ కి కాదు. గతంలో కేంద్ర మాజీ మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ తరపునే ప్రచారానికి దిగుతున్నారట.
ఇప్పటికీ మెగాస్టార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే చిరంజీవి తన మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. తెలంగాణలోని చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించాలని చిరు డిసైడ్ అయ్యారట. తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మరోవైపు, చిరంజీవికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. చిరంజీవి కోడలు ఉపాసనకు విశ్వేశ్వర్ రెడ్డి(రాంచరణ్ భార్య ) స్వయానా బాబాయ్. ఇందుకోసమే అయన ప్రచారానికి దిగుతున్నట్టు స్పష్టమవుతుంది.