Chiranjeevi: చిరు అసలు తగ్గట్లేదుగా..!

  • August 25, 2021 / 02:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేసేస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ సెట్స్ పైకి వెళ్లనున్నారు. దాని తరువాత దర్శకుడు బాబీతో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ సినిమాలను పూర్తి చేయనున్నారు. ఇవి కాకుండా ఇప్పుడు మరో రెండు సినిమాలు చేయడానికి ఫిక్స్ అయ్యారు చిరంజీవి. తనకు చరణ్ కు ఉన్న ఆబ్లిగేషన్లు, కమిట్మెంట్లు అన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తున్నారు.

నిర్మాత కేఎస్ రామారావుకి ఏకే ఎంటర్టైన్మెంట్స్ సినిమాలో భాగస్వామిగా చేర్చారు. తన సన్నిహిత మిత్రుడు జికె మోహన్ ను మైత్రి మూవీస్-బాబీ సినిమాలో యాభై శాతం భాగస్వామిగా చేర్చారు. యువి అధినేతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి కోసం ఓ సినిమా చేయాలనేది రామ్ చరణ్ కోరిక. అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాల తరువాత సినిమా యువి నిర్మాతలతో చేయబోతున్నారు. దర్శకుడు మారుతి ఓ లైన్ ఓకే చేయించుకొని.. కథ రెడీ చేస్తున్నారు.

అది ఓకే అయితే మారుతిని దర్శకుడు. లేదంటే మరో దర్శకుడి కోసం చూస్తారు. ప్రొడక్షన్ హౌస్ మాత్రం యువి క్రియేషన్సే. ఆ తరువాత డీవీవీ దానయ్యకు ఓ సినిమా చేస్తారు. ఇది కూడా ఎప్పుడో అనుకున్న ప్రాజెక్టే. దానికి ఇంకా డైరెక్టర్ ఫైనల్ అవ్వలేదు. ఇవి పూర్తయిన తరువాత కానీ చిరు మరో సినిమా చేయలేరు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus