Megastar Chiranjeevi: ఫ్యాన్‌ అడిగాడని.. మాట మర్చిన చిరంజీవి.. ఆడిటోరియం దద్దరిల్లి..!

చిరంజీవిని (Chiranjeevi)  టాలీవుడ్‌ బాస్‌ అని పిలుస్తుంటారు. దాని వెనుక ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పొచ్చు కానీ.. అన్ని విభాగాల మీద, అన్ని రకాల కథల మీద ఆయనకున్న పట్టు కారణంగానే అలా ఆయన పిలవబడుతున్నారు అనేది ఎవరూ కొట్టిపారేయలేని విషయం. అందులో డైలాగ్‌ డెలివరీ కూడా ఒకటి. ఆయన చాలా రకాల యాసల్లో మాట్లాడగలరు. అందులో బాసిజం చేయడం వల్ల ఆయన బాస్ అయ్యారు అంటారు. మాండళికాలు, యాసల విషయంలో ఆయనకున్న పట్టు ఇటీవల జరిగిన ‘జీబ్రా’ (Zebra) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కనిపించింది.

Megastar Chiranjeevi

సత్యదేవ్ (Satya Dev)  , డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ (Eashvar Karthic) తెరకెక్కించిన చిత్రం ‘జీబ్రా’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై మాట్లాడుతుండగా ఓ అభిమాని ‘బాసూ నిన్ను చూడానికి వైజాగ్‌ నుండి వచ్చాను’ అని గట్టిగా అరిచాడు. ఆ మాటలకు ఆనందపడి వదిలేసే రకం చిరంజీవి కాదు కదా. వెంటనే ఆయన రియాక్ట్‌ అవుతూ ‘అయితే ఏటంటావ్‌ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుండి వచ్చినందుకు సంతోషమే..

మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే’ అని ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. దీంతో వేదిక చప్పట్లతో మారుమోగింది. ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ‘జీబ్రా’ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద సత్యదేవ్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఆ ఆశలకు తగ్గట్టే ఉన్నాయి. ఇక చిరు సినిమాల విషయానికొస్తే వశిష్ఠ (Mallidi Vasishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’(Vishwambhara) లో నటిస్తున్నాడు.

ఈ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉన్నా.. ‘గేమ్‌ ఛేంజర్‌’కి (Game Changer) లైన్‌ క్లియర్‌ చేసి తర్వాత వస్తామని చిరు ఫిక్స్‌ అయ్యారు. సినిమా షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు తిరిగి చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తున్నారు. చిత్రీకరణ కోసం జపాన్‌ వెళ్లనున్నారని సమాచారం. అక్కడ ఓ పాటను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. త్వరలో సినిమా రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేస్తారట.

చిన్న కథ రాస్తా అనుకుని.. సినిమా తీసేశారట.. ‘మట్కా’ బ్యాక్‌ స్టోరీ ఇదీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus