ఇప్పట్లో కొరటాల సినిమా కష్టమేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మెగాస్టార్ 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడంటూ వార్తలు వచ్చాయి. 2019 జనవరి నుండీ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు.

అయితే ఇంతలో ఏమయ్యిందో ఏమో ఇప్పుడు మెగాస్టార్ మనసు మార్చుకున్నారు. ఇటీవల జరిగిన ‘వినయ విధేయ రామా’ చిత్రానికి అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో చేయబోతున్నట్టు స్పష్టం చేసారు. ఈ చిత్రానికి డీ.వీ.వీ దానయ్య నిర్మించబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే కొరటాల శివ మెగాస్టార్ కోసం కథను సిద్ధం చేసేసాడట. అది కూడా మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకుని కథ – కథనాల్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ కథకు సూటయ్యే హీరో కూడా దొరకడం కష్టమే. పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలనుకున్నా.. ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ ఆఫీస్ పనులు అలాగే ఎన్నికల హడావుడిలో బిజీగా ఉంటారు. ఇక మహేష్ బాబు తో సినిమా చేయాలన్నా.. ఇప్పటికే సుకుమార్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా లైన్లో ఉన్నారు. ఇక జూ.ఎన్టీఆర్ రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ అయ్యేవరకూ కష్టమే. ప్రభాస్ కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇలా అందరూ బిజీగా ఉండటంతో ఇప్పట్లో కొరటాలతో సినిమా రావడానికి మరో రెండు సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే మహేష్ 26 వ సినిమా సుకుమార్ తో అనుకున్నప్పటికీ కథ ఫైనలైజ్ కాకపోతే వేరే దర్శకుడిని సంప్రదించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క అల్లు అర్జున్ -త్రివిక్రమ్ సినిమా 2019 దసరాకి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కొరటాలకి మహేష్ లేదా అల్లు అర్జున్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus