శ్రీహరి సినిమాల పై ఆయన కొడుకు మేఘాంశ్ కామెంట్స్..!

దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జూలై 5న ఈ చిత్రం విడుదల కానుంది.అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు కలిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సత్తిబాబు నిర్మించాడు.జూలై 5న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లను వేగవంతం చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. మేఘాంశ్ కూడా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు.

ఇక తాజాగా మేఘాంశ్ ఓ ఇంటర్వ్యూల్లో ఈ విధంగా స్పందించాడు.. “టీవీల్లో గానీ .. యూట్యూబ్ లో గానీ నాన్న సినిమాలు చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఆయన చేసిన ఎమోషనల్ సీన్స్ చూసినప్పుడు ఏడుపొచ్చేస్తుంది. ఆయన చేసిన సినిమాల కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. తరచూ వాటిని మేము చూస్తూనే ఉంటాము. ‘రాజ్ దూత్’ చిత్రంలో ఆదిత్య మీనన్ ‘రాజన్న’ పాత్ర చేశాడు. ఆ పాత్రను మా నాన్నగారే చేస్తే బాగుండేది కదా అనిపించింది. మా అన్నయ్య కూడా అదేమాట అన్నాడు. ఇలా నాన్న ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూనే ఉంటారు .. ఆయన గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాము” అంటూ తన తండ్రి గురించి చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus