‘ఈ సినిమా చూశాక ‘పోకిరి’ ఫ్లాప్ అనిపిస్తుంది” అంటూ పూరీ నిన్న రాత్రి ట్విట్టర్ లో చేసిన స్టేట్ మెంట్స్ వైరల్ అయ్యాయి. నిజానికి వర్మ అన్నది ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో. నిన్న సాయంత్రం పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న “మెహబూబా”లోని కొన్ని షాట్స్ మరియు సీన్స్ చూసిన రాంగోపాల్ వర్మ పై విధంగా తన ట్విట్టర్ లో స్పందించారు. అలాగే.. పూరీ తన కుమారుడు కాబట్టి “మెహబూబా” విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకొన్నాడని కూడా పేర్కొన్నాడు.
సో, వర్మ చేసిన ఇంటల్లెక్చువల్ కామెంట్స్ కి మహేష్ ఫ్యాన్స్ కోప్పడాలో లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉండగా.. పూరీ జగన్నాధ్ మాత్రం తన గురువు తన సినిమా గురించి ఈస్థాయిలో పొగడడం గురించి మాత్రం అమితానందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకొంటున్న “మెహబూబా” చిత్రీకరణ మార్చి లేదా ఏప్రిల్ కల్లా పూర్తవుతుంది. మే నెలలో వేసవి కానుకగా “మెహబూబా” చిత్రాన్ని విడుదల చేయాలని పూరీ ప్లాన్. అయితే.. సినిమాకి సంబంధించి వర్మ కామెంట్స్ సినిమా యూనిట్ కి మంచి బూస్ట్ ఇచ్చాయి. అసలే “టెంపర్” తర్వాత మరో కనీస స్థాయి హిట్ లేక ఇబ్బందిపడుతున్న పూరీ జగన్నాధ్ కి “మెహబూబా” హిట్ అవ్వడం ఒక డైరెక్టర్ గా కంటే ఒక తండ్రిగా చాలా ఇంపార్టెంట్. చూద్దాం మరి ఆయన ఏమేరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొన్నాడో.