పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాల్లో నటించదా..?

సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలన్నా, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా అంత తేలిక కాదు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఇండస్ట్రీలో విజయాలను సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ గా, మిడిల్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుంటారు. అలా మిడిల్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ కు ఎఫ్ 2 సినిమా నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా మెహ్రీన్ నటిస్తున్నారు. అయితే 25 సంవత్సరాల వయస్సులోనే మెహ్రీన్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మార్చి 12వ తేదీన మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక జరగగా పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో కాంగ్రెస్ యువనేత భవ్య భిష్ణోయ్ తో మెహ్రీన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తరువాత మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ అయినా, ఇతర ఇండస్ట్రీ అయినా పెళ్లి జరిగితే హీరోయిన్ కు సినిమా ఆఫర్లు తగ్గుతాయనే సంగతి తెలిసిందే. మెహ్రీన్ చేసుకోబోయే అబ్బాయి రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మెహ్రీన్ సినిమాల్లో నటించే అవకాశాలు తక్కువని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో ఎఫ్ 3 మూవీనే మెహ్రీన్ చివరి సినిమా అయ్యే అవకాశం ఉందని మెహ్రీన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మెహ్రీన్ స్పందిస్తే మాత్రమే ఆమె పెళ్లి తరువాత నటిగా కొనసాగుతారో లేదో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus