త్రివిక్రమ్-ఎన్టీయార్ కాంబో మూవీలో ముద్దుగుమ్మ!

సినిమాకి సినిమాకి గ్యాప్ బాగా ఎక్కువవ్వడం వల్ల ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ.. బొద్దుగుమ్మ మెహరీన్ చాలా సైలెంట్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. పరిచయ చిత్రం “కృష్ణగాడి వీరప్రేమగాధ”, కొంచెం గ్యాప్ ఇచ్చి యాక్ట్ చేసిన “మహానుభావుడు”, రీసెంట్ గా వచ్చిన “రాజా ది గ్రేట్” చిత్రాలతో కలిపి మెహరీన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. మరీ బొద్దుగా ఉండడంతోపాటు.. సన్నివేశానికి తగ్గ హావభావాలు ఇవ్వలేదనే మైనస్ పాయింట్స్ పక్కన పెట్టేస్తే.. ఒక కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న అమ్మాయి మెరహీన్. గ్లామర్ షోకి వెనకడుగు వేయకపోవడం, లిప్ లాక్స్ గట్రా వంటి విషయాల్లో మొహమాటపడకపోవడం మెహరీన్ కి ఉన్న ప్రత్యేక లక్షణాలు.

ఈ లక్షణాలు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఈ ప్రత్యేకమైన లక్షణాలు బాగా నచ్చినట్లున్నాయ్. అందుకే ఎన్టీయార్ హీరోగా తాను తెరకెక్కించబోయే చిత్రంలో కథానాయికగా మెహరీన్ పేరు పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కంట్లో పండిందంటే.. మహారీన్ కెరీర్ గ్రాఫ్ లో భూకంపం చోటు చేసుకొని ఒక్కసారిగా అందలం చేరడం ఖాయం.

మరి మెహరీన్ కు ఆ అదృష్టం ఉందా? త్రివిక్రమ్ ఈ తెల్లతోలు సుందరినే ఫైనల్ చేస్తాడా? లేక లాస్ట్ లో ప్రస్తుతం తన ఫేవరెట్ హీరోయిన్ అయిన అను ఎమ్మాన్యుల్ కే ఈ క్రేజీ ఆఫర్ ను కూడా కట్టబెడతాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus