ఒకప్పుడు టాలీవుడ్‌లో రీమేక్ కథల కోసం ప్రత్యేకంగా దర్శకులు ఉండేవారు. అంటే వాళ్లు కేవలం రీమేక్‌లే చేస్తారని కాదు. రీమేక్‌లు బాగా చేస్తారని. రీమేక్ సినిమా చేయాలనుకునే హీరోలకు, దర్శకులకు ఇన్‌స్టంట్ ఆప్షన్ అన్నమాట. అయితే ఇప్పుడు అలాంటివాళ్లు తగ్గారు. స్ట్రెయిట్ సినిమాలు తీసి హిట్లు కొట్టేవాళ్లే రీమేక్‌లవైపు వస్తున్నారు. వాళ్లు ఆ కథ ఒప్పుకోవడం వెనుక కారణాలుంటున్నాయి. అవి ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే… ఆ సినిమా అయ్యాక ఇక మరి రీమేక్‌లు చేయం బాబోయ్ అనేంతగా.
‘రీమేక్‌లు నాకొద్దు బాబోయ్’ అంటున్న దర్శకుల జాబితాలో తాజాగా మేర్లపాక గాంధీ చేరారు. ‘మాస్ట్రో’తో త్వరలో ఓటీటీ ద్వారా రాబోతున్నారు గాంధీ. అయితే ఈ సినిమా అనుకోకుండా చేశానని, దీని తర్వాత రీమేక్‌లు చేసేది లేదు అని అంటున్నారు. ‘అంధాదున్’ చూడగానే సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు బాగా నచ్చాయట ఆయనకు. నేర నేపథ్యం, హాస్యం ఆకట్టుకుంది అనుకున్నారట. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అప్పుడు అనిపించిందట. అప్పుడే నిర్మాత సుధాకర్‌రెడ్డి, నితిన్ కాంటాక్ట్ అవ్వడంతో ఈ సినిమా చేశారట గాంధీ.
రీమేక్ చేయడం కష్టమే. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే కాపీ, పేస్ట్ అంటారు. మార్పులు చేస్తేనేమో మాతృక ఆత్మను చంపేశారంటారు. ఎలా చేసినా రీమేక్ అనగానే పోల్చి చూడటం మొదలవుతుంది. అందుకే ఈ సినిమా తర్వాత రీమేక్ చేయకూడదని నిర్ణయించాను అని మేర్లపాక గాంధీ చెప్పారు. ఇక్కడే ఇంకో విషయం ఉంది. గతంలో ఇలా వరుస రీమేక్‌లు చేసిన దర్శకుడిని… రీమేక్‌ల దర్శకుడు అని ముద్రవేసి డైరక్ట్ సినిమాలు వచ్చే అవకాశం తగ్గేది. గాంధీ అవన్నీ చూసే ఇలా అన్నారేమో.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!