స్టాండప్ కామెడీ షో ల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఇది దక్షిణాదిన ప్రాచుర్యం చెందుతోంది. కొన్నేళ్ళ నుండీ తమిళ ప్రేక్షకులు ఇటువంటి స్టాండప్ కామెడీ షో లకు బాగా అలవాటు పడ్డారు.ఇప్పుడు తెలుగులో కూడా స్టాండప్ కామెడీ షోల హవా మొదలవుతుంది. నిజానికి స్టాండప్ కామెడీ అంటే ఏంటి? ఓ కమెడియన్ స్టేజి పై నిలబడి.. ఏదో ఒక అంశం పై బోల్డ్ గా స్పందిస్తూ.. తాను నవ్వకుండా, హావభావాలను పలికించకుండా అందరినీ నవ్వించగలగాలి.
ఇది అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఆర్ట్ అన్న మాట. నేను చెబుతుంటే మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు.. అందుకే వైరల్లి నిర్మాణ సంస్థ వారు ఓ స్టాండప్ కామెడీ షో ని రూపొందించారు. ‘మైక్ కి కిరి కిరి’ అనే పేరుతో ఈ స్టాండప్ కామెడీ షో రూపొందింది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఆధ్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా ఈ ట్రైలర్ ఉంది.
నిజ జీవితంలో మనం ఫేస్ చేసే ఇష్యూస్ ను ఎంతో ఎంటర్టైనింగ్ గా వర్ణించారు కొంతమంది కమెడియన్లు..! అడల్ట్ కంటెంట్ డైలాగులు, అక్కడక్కడ సంస్కృతం కూడా ఉంటుంది కాబట్టి.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినాలని ట్రైలర్ ప్రారంభం అవ్వకముందే పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీనిని మీరు కూడా ఓ లుక్కేయండి :