Michael Twitter Review:’మైఖేల్’ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తొలి పాన్ ఇండియా చిత్రం ’మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి’ ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’ బ్యానర్లపై భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ వంటి స్టార్లు కూడా నటించడంతో ఈ ప్రాజెక్టు పై బోలెడంత క్రేజ్ నెలకొంది.

మైఖేల్ టీజర్, ట్రైలర్లకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈరోజు అంటే ఫిబ్రవరి 3న రిలీజ్ అయిన ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘మైఖేల్’ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. సందీప్ కిషన్ ఎనర్జిటిక్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యింది అంటున్నారు. అలాగే మిగతా తారాగణం కూడా చాలా బాగా నటించినట్టు చెబుతున్నారు.

యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయట. ఇక సెకండ్ హాఫ్ అక్కడక్కడా డ్రాగ్ అయినట్టు అనిపించినా తర్వాత పికప్ అయ్యిందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా బాగానే ఉందని చెబుతున్నారు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు ముగిసాక టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus