Michelle Lee: కత్రీనా టవల్ ఫైట్.. సినిమాకే హైలెట్ అవుతుందంటున్న నటి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదొక స్పై యాక్షన్ డ్రామా అని ట్రైలర్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.విజువల్స్ అన్నీ రెగ్యులర్ యాక్షన్ సినిమాల్లో ఉండే రీతిగానే ఉన్నాయి. అయినా ఈ ట్రైలర్ ట్రెండింగ్లో నిలిచింది. కారణం హీరోయిన్ కత్రీనా కైఫ్ టవల్ ఫైట్ అని చెప్పాలి. ఆమె ఓ వైట్ టవల్ వెనుక నిలబడి ఇచ్చిన ఫోజు ట్రైలర్ కి హైలెట్ అయ్యింది.

అందులో కత్రీనాతో పోరాడుతుంది ఓ హాలీవుడ్ నటి. స్కార్లెట్ జాన్స‌న్ మూవీ బ్లాక్ విడో, జానీ డెప్ మూవీ పైరెట్స్ ఆఫ్ క‌రేబియ‌న్‌, బ్రాడ్ పిట్ మూవీ బుల్లెట్ ట్రెయిన్, టామ్ హార్డీ మూవీ వెనమ్ ఇలా ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మిచెల్లీ ఈ టవల్ ఫైట్లో కనిపించింది అని చెప్పాలి. ఈ ఫైట్ గురించి మిచెల్ లీ మాట్లాడుతూ ‘‘ఈ ఫైట్‌ను చిత్రీక‌రించ‌టానికి ముందు నేను, క‌త్రినా క‌లిసి కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేశాం. ఆ ఫైట్‌, దాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం.

అందులో న‌టించేట‌ప్పుడు మేము బాగా ఎంజాయ్ చేశాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో దీన్ని రూపొందించారు. క‌త్రినా కైఫ్ గొప్ప న‌టి. ఎంతో ప్రొఫెష‌న‌ల్ ప‌ర్స‌న్‌. ఈ ఫైట్‌లో న‌టించ‌టానికి త‌నెంతో క‌ష్ట‌ప‌డింది. త‌నతో వ‌ర్క్ చేయ‌టం ఎంతో సులువుగా అనిపించింది. మేం శరీరాలకు టవల్స్ చుట్టుకుని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో పాల్గొన్నాం. ఇలాంటి యాక్ష‌న్ సీక్వెన్స్ చేయ‌డానికి పర్ఫెక్ట్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అవ‌స‌రం. దాన్ని ఎంతో అందంగా డిజైన్ చేశారు. ఇదొక ఛాలెంజింగ్‌గా (Michelle Lee) అనిపించింది.

ఒక‌రినొక‌రు గాయ‌ప‌రుచుకోకుండా ఓ క‌చ్చిత‌మైన దూరాన్ని పాటిస్తూ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొన‌టం కూడా ఓ ఛాలెంజింగ్ విష‌య‌మే. ఇద్ద‌రం ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి గాయాలు కాలేదు.” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ‘య‌ష్ రాజ్ ఫిలిమ్స్’ బ్యాన‌ర్ పై రూపొందిన ‘టైగ‌ర్ 3’ చిత్రాన్ని ఆదిత్య చోప్రా అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంచారు. దీపావ‌ళి కానుకగా న‌వంబ‌ర్ 12న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదల కానుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus