Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఘనంగా జరిగిన “మైల్స్ అఫ్ లవ్”‘ ప్రి రిలీజ్ వేడుక..అక్టోబర్ 29న గ్రాండ్ గా రిలీజ్

ఘనంగా జరిగిన “మైల్స్ అఫ్ లవ్”‘ ప్రి రిలీజ్ వేడుక..అక్టోబర్ 29న గ్రాండ్ గా రిలీజ్

  • October 26, 2021 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా జరిగిన “మైల్స్ అఫ్ లవ్”‘ ప్రి రిలీజ్ వేడుక..అక్టోబర్ 29న గ్రాండ్ గా రిలీజ్

కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి ,రమ్య పసుపులేటి జంటగా నందన్ దర్శకత్వంలో  రామ్ కామ్  బాక్డ్రాప్ లో  రాజు రెడ్డి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రం “మైల్స్ ఆఫ్ లవ్ “. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ‘తెలియదే.. తెలియదే’ అనేపాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది.

ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే ఉండడం మరో విశేషం. ఈ ఒక్క పాట సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి.  ఇదిలా ఉండగా చిత్రంలోని ‘గగనము దాటే’ వీడియో సాంగ్ ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల ఆయింది.అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, హీరో దినేష్,పాగల్ డైరెక్టర్ నరేష్, నిర్మాత బాబ్జి , గాయత్రి గుప్త తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన హీరో కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి.ధ్రువన్ మంచి సంగీతం అందించారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా నందన్ లాంటి మంచి దర్శకుడు తో ఈ కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా నిర్మించాడు.ఏ మూవీ కైనా నిర్మాత దొరకడంచాలా కష్టం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యినట్లు.ఈ సినిమా ద్వారా  ఇండస్ట్రీకి  కొత్త ప్రొడ్యూసర్ రావడం చాలా సంతోషంగా ఉంది.డైరెక్టర్ నందన్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇంకా ఇలాంటి మంచి మూవీస్ ఎన్నో చేయాలి. హీరోయిన్ రమ్య చాలా చక్కగా నటించింది. నా సినిమా RX 100 లోని “పిల్లారా..” సాంగ్ హిట్ అయినప్పుడే అదే ఇయర్ లో అభినవ్ ది ‘ఉండిపోరాదే’ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఇయర్  హిట్ సాంగ్స్ లలో ఎప్పుడూ ఈ రెండు సాంగ్స్  మాత్రమే ఉండేవి. ఈ సాంగ్స్  మధ్యనే కాంపిటీషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు తన సినిమా ఫంక్షన్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమాతో పాటు విడుదల అవుతున్న అన్ని సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. చిత్ర నిర్మాత రాజిరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా నాకు తెలుసు. తనకు సినిమా తీయాలని తపన ఉన్న వ్యక్తి. ఒక చిన్న కథను సెలెక్ట్ చేసుకొని లాక్ డౌన్ టైం లో హుషారు ఫేమ్ అభినవ్ తొ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది.తను పడ్డ కష్టానికి ఈ సినిమా ద్వారా కచ్చితంగా ప్రతి ఫలం లభిస్తుంది. ధ్రువన్ ఇచ్చిన పాటలు ఎంతో హిట్ అయ్యాయి.ఇందులో సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను  కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే  ఉండడం మరో విశేషం. యశస్వి ఫెంటాస్టిక్ గా పాడాడు. ఈ చిత్రం లోని విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. డైరెక్టర్  సాంగ్ పిక్చరైజేషన్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమా సక్సెస్ అయి మా రాజిరెడ్డి ఇంకా మరిన్ని మంచిత్రాలు తియ్యాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

చిత్ర నిర్మాత రాజారెడ్డి మాట్లాడుతూ …మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ కి కార్తికేయ కు,నిర్మాత బాబ్జి,దర్శకుడు నరేష్, దినేష్ గార్లకు ధన్యవాదాలు.ఈ సినిమాకు ఆర్.ఆర్.ధ్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.రమ్య, అభినవ్ కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది.అభినవ్ మల్టీ టాలెంటెడ్. మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్టుతో “మైల్స్ ఆఫ్ లవ్” చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాడు.రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ లో కాకుండా చేసిన ఈ సినిమా క్లీన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ  కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అన్నారు

చిత్ర దర్శకుడు నందన్ మాట్లాడుతూ ..మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రెజెంట్ యూత్ కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బాక్డ్రాప్ లో క్లీన్ మూవీగా రూపొందించాం.ఈ మూవీకు కొత్త డైరెక్టర్, కొత్త డిఓపి ని పెట్టుకొని నన్ను నా కథపై ఉన్న నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు మా నిర్మాత రాజిరెడ్డి గారు. తను ఈ చిత్రాన్ని ఎక్కడా వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు. బెక్కం వేణుగోపాల్ గారు మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వారికి చాలా థాంక్స్. ఆర్.ఆర్ ధ్రువన్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఈ  మ్యూజిక్ కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. అభినవ్, రమ్యల పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగా ఉంటుంది. ఈ రోజు ఈ చిత్రం ప్రి రిలీజ్ జరుపు కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

పాగల్ చిత్ర దర్శకుడు నరేష్ మాట్లాడుతూ.. ఈ మూవీ టీం అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అభినవ్,రాజారెడ్డి ,రమ్య వీరంతా ఎంతో కష్టపడి చేశారు. ఇందులో 2,3 సాంగ్స్ చూశాను అన్నీ చాలా బాగున్నాయి. డి.ఒ.పి రవి చాలా బాగా చూపించారు. అందరూ టీమ్ వర్క్  కలసి చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాత బాబ్జి మాట్లాడుతూ ..అభి చాలా మంచి యాక్టర్ తనకు మంచి భవిష్యత్తు ఉంది. నాలుగు పాటలు ఒక సినిమాలో హిట్ అవడం అనేది అంత ఈజీ కాదు. విజువలైజ్ గా చాలా బాగున్నాయి. ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

గెస్ట్ గా వచ్చిన హీరో దినేష్ మాట్లాడుతూ ..అభినవ్ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్… రైటింగ్ ఎడిటింగ్ అన్నీ చూసుకుంటూ మ్యూజిక్ కంపోజ్ కూడా చేసుకుంటాడు. తను ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి .సాంగ్స్ చాలా బాగున్నాయి.ఈ మూవీ చూశాను చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. నిర్మాత రాజి రెడ్డి  గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఆర్టిస్ట్ & డైరెక్టర్ గాయత్రి గుప్తా మాట్లాడుతూ .. అభి మంచి యాక్టర్ &  మంచి రైటర్ కూడా. ఇంకా తనలో చాలా టాలెంట్ ఉంది. ఇందులోమ్యూజిక్ సో బ్యూటిఫుల్. ఈ మూవీ తప్పకుండా విజయం సాధించాలని అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ .. నా లైఫ్ లో ఇది స్పెషల్ మూమెంట్. ఇది నా ఫస్ట్ మూవీ. ఇలాంటి ప్రి రిలీజ్ ఈవెంట్  కోసం నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ 2020 లో “సోలో బ్రతుకు సో బెటర్” సినిమా లోని ‘హే ఇది నేనేనా’..,’ఇది నీ పెళ్లి’ వంటి పాటలతో లిరిసిస్ట్ గా మంచి బ్రేక్ వచ్చింది. తరువాత నేను మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాను. అలా లాక్ డౌన్ టైమ్ లో మధుర శ్రీధర్ గారి ద్వారా రాజిరెడ్డి అన్న కనెక్ట్ అయ్యాడు. అభినవ్ తో మూవీ అనగానే తను చేసిన సినిమాలోని ‘ఉండి పోరాదే’ సాంగ్ గుర్తుకొచ్చింది. అది నా పేవరేట్ సాంగ్. ఆ సాంగ్ ను నేను ఎన్నో షోస్ లలో పాడడం జరిగింది. అలాంటిది ఈ సినిమాలో కూడా అభినవ్ కు గుర్తుండిపోయే సాంగ్స్ ఇవ్వాలనుకున్నాను. అనుకున్ననట్లే ఇందులో ఉన్న అన్ని పాటలు హిట్ అయ్యాయి. అలా వైకుంఠ పురం తర్వాత సిద్ శ్రీరాం,అర్మాన్ మాలిక్ వంటి గొప్ప సింగర్స్ ఈ సినిమాకు రిపీట్ అవ్వడంతో ఈ సినిమాలోని పాటలకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ శ్రీరామ్ గారు పాడిన  ‘తెలియదే తెలియదే’ పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటలు ఇంతపెద్ద హిట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్ లో నేను ప్రేక్షకులకు ఇంకా మంచి సాంగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రాజిరెడ్డి , అభినవ్ , నందన్, మణి గార్ల తో నాది చాలా యూనిక్ జర్నీ. నేను ఎన్నో విషయాలు తెలుసు కున్నాను, నేర్చుకున్నాను. ఈ జర్నీ నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాటలు ఇచ్చిన నా లిరిసిస్ట్ చారి,రాజు లకు ధన్య వాదాలు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

చిత్ర హీరో అభినవ్ మేడిశెట్టి మాట్లాడుతూ .. నందన్ తో మేము స్టోరీని డిస్కషన్ చేసుకొని మూవీ స్టార్ట్ చేశాము. డి.ఓ.పి మణి గారు ఓన్లీ కెమెరా వర్క్ వరకే కాకుండా నాకు ప్రతి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ లలో నాతో ట్రావెల్ అయ్యాడు. ధ్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటల ద్వారా ఈ సినిమాకు మంచి వెయిట్ వచ్చింది. నా సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2001లో  వచ్చిన ‘చెలి’ సినిమా చూసినప్పుడు ఆ వినిమాలోని పాటలకు ఫీలింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సినిమాలోని పాటలకు ఆలాంటి ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా డెడికేటెడ్ గా వర్క్  చేశారు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మా టీంను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ రమ్య పసుపులేటి మాట్లాడుతూ..నందన్ గారు నాకు మంచి పాత్ర ఇచ్చి నన్ను చాలా బాగా చూపించారు. అభినవ్ నాకు మంచి కో స్టార్. మేము చాలా మంచి ఫ్రెండ్స్. తన ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. బెక్కం వేణు గోపాల్ గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నా సినిమాకు ఇంత మంచి సాంగ్స్ కుదిరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంచి సినిమాలో నటించే ఆకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

డి ఓ పి రవి గారు మాట్లాడుతూ.. అభినవ్ లేకపోతే “మైల్స్ఆఫ్ లవ్” సినిమా ఉండేది కాదు. మేము లైన్ తీసుకొని వెళ్లిన తర్వాత తను ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించాడు. చిన్నగా  స్టార్ట్ చేసిన మాకు ఇంత పెద్ద  రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. సాంగ్స్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ధ్రువన్ గారు నా విజువల్స్ కి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేము ఈ సినిమాను చాలా జెన్యూన్ గా తీశాము. అక్టోబర్ 29న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

లిరిసిస్ట్ పూర్ణా చారి మాట్లాడుతూ ..’మైల్స్ ఆఫ్ లవ్’ చూస్తుంటే స్మైల్స్ ఆఫ్ లవ్ గా మారుతుంది. ఇందులో నీలంబరి, ఒకటే ఒక లైఫ్ అని రెండు పాటలు రాశాను. ధ్రువన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తనలో మంచి ఫైర్ ఉంది, అది “మైల్స్ ఆఫ్ లవ్” రూపంలో బయటకు వచ్చింది. అలరాజు గారు “తెలియదే తెలియదే”, “గగనందాటి” రెండు పాటలు రాశాడు. అలాగే నందు, మణి గార్లు ఏదైనా ఒక పని చేయాలనకొంటే అది పూర్తి అయ్యేవరకు ఆపకుండా ఎంత కష్టమైనా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలా ఆపకుండా ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. అందరూ ఫ్రెష్ టాలెంట్ తో చాలా బాగా తీశారు. 29 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

లిరిసిస్ట్ ఆలరాజు మాట్లాడుతూ.. నందన్, మణి గార్లు చాలా సపోర్ట్ ఇచ్చారు. రఘురాం గారు అద్బుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో ఆర్.ఆర్ ధ్రువన్ గా మన ముందుకు వస్తున్నాడు.నిజంగా చెప్పాలంటే తనొక సంగీత కెరటం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సినిమాలోని పాటలు వింటుంటే మీకే తెలుస్తుంది.అంత మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులో నేను రెండు పాటలు రాశాను. అందులోని ‘తెలియదే’  అను పాటను సిద్ శ్రీరామ్ గారు పాడారు. ఏ ప్రమోషన్ లేకుండా జన్యున్ గా ఈ పాట యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే  ఉండడం మరో విశేషం. ఇది నాకు ప్రౌడ్ మూమెంట్. అలాగే గగనందాటి అనే పాటను ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు. ఈ పాటతో పెద్ద వాళ్ళు సాయి మాధవ్ బుర్ర లాంటి వాళ్ళు నన్ను పిలిచి అప్రిష్యేట్ చేశారు. అలాగే మా ఈ చిన్న సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి కండలే గాదు మంచి గుండె కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. వారికి ధన్యవాదాలు అన్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav
  • #miles of love movie
  • #NandhaN
  • #Ramya

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

19 mins ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

35 mins ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

6 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

8 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago

latest news

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

5 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

6 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

6 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

7 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version