Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ కి నెగిటివ్ టాక్ రావడానికి 10 కారణాలు..!

  • August 18, 2022 / 09:51 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరొందిన ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’.ఆమిర్ ఖాన్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ, హైదరాబాదీ ఆడియన్స్ అయితే అతని సినిమాలు తెగ చూస్తుంటారు.ఒకటి కాదు రెండు కాదు ఇతని కెరీర్లో ఏకంగా 5 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.హాలీవుడ్లో క్లాసిక్ గా నిలిచిన ‘ఫారెస్ట్ గంప్’ కి రీమేక్ గా తెరకెక్కింది ‘లాల్ సింగ్ చడ్డా’. ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించారు. అంతేకాకుండా మన నాగ చైతన్య కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇవి చాలవా.. తెలుగు ప్రేక్షకులు కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ ని చూడాలనే ఆసక్తిని పెంచుకోవడానికి..! కానీ సినిమా మాత్రం నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. అందుకు కారణాలు లేకపోలేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి :

1) 30 ఏళ్ళ క్రితం వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. ఆ సినిమాని ఎక్కువ మంది చూడకపోవడం ‘లాల్ సింగ్ చడ్డా’ కి మొదటి నుండి ప్లస్ పాయింట్ అయ్యింది. ఆ కథతో పోలిస్తే.. ఇందులో చాలా మార్పులు చేశారని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ అది 142 నిమిషాల సినిమా అయితే ఇది 165 నిమిషాల సినిమా. కానీ థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు ఏదో 4 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

2) చెప్పుకోవడానికి కథ బాగానే ఉంటుంది. కానీ కథనం చాలా వీక్ గా ఉంటుంది. ఇందుకు అద్వైత్ చందన్ ను బ్లేమ్ చేయక తప్పదు. హిందీ ప్రేక్షకులు కూడా బయోపిక్ లు, డాక్యుమెంటరీలు వంటి వాటిని చూసి చూసి అవి బోర్ కొట్టేసి..’పుష్ప’ వంటి సౌత్ సినిమాలను చూడ్డానికి ఇష్టపడుతున్నారు. వీటిని దర్శకుడు కనీసం గ్రహించలేదా అనే అనుమానం అడుగడుగడునా కలుగుతుంది.

3) ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య వంటి వారి పాత్రలు తప్ప మిగిలిన పాత్రలు ఏమాత్రం గుర్తుండవు అనడంలో అతిశయోక్తి లేదు. తల్లి పాత్ర చేసిన మోనా సింగ్ మాత్రం పర్వాలేదు అనిపించింది. అందుకే సినిమా నిండా బోలెడంత క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఏ పాత్ర కూడా గుర్తుండదు.

4) ఆమిర్ ఖాన్ బాగా నటించాడు. ఇలాంటి పాత్రకు అతనే కరెక్ట్. కానీ ప్రతీసారి కళ్ళు పెద్దవి చేసి నవ్వడం లేదా పరిగెత్తడం. ‘ధూమ్ 3’ ‘పీకే’ వంటి సినిమాల్లో ఆమిర్ కనిపిస్తాడు. కథనం వేగంగా సాగకపోవడంతో భారం అంతా ఆమిర్ భుజాల పై పడింది. ఆమిర్ ఈసారి పూర్తిస్థాయిలో దానిని మోయలేకపోయాడు. ‘దంగల్’ సినిమాకి ఆమిర్ ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డాడు. కానీ ‘లాల్ సింగ్ చడ్డా’ విషయంలో అతని బాడీలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం వి.ఎఫ్.ఎక్స్ టీం కృషి అని తేల్చేశాడు. కాబట్టి ఈసారి ఆమిర్ కి ఆ క్రెడిట్ కూడా దక్కదు.

5) కరీనా కపూర్ .. రూప పాత్రలో బాగా నటించింది. కానీ ఆమె పాత్ర.. ఒక వ్యాంప్ పాత్రని తలపిస్తుంది. ఆమె లుక్స్ కూడా ఆమె ఏజ్ ను గుర్తు చేసే విధంగా ఉంటాయి. డబ్బుంటే ఒకలా.. డబ్బు లేకపోతే ఇంకోలా ప్రవర్తించే ఆ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పకపోగా ఈ పాత్రతో బాగా బోర్ కొట్టించాడు.

6) సినిమాలో ఉన్నంతలో నాగ చైతన్య చేసిన బాలరాజు పాత్ర మెప్పిస్తుంది. ఈ సినిమా కోసం అతను చూపించిన వేరియేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. కాకపోతే చీటికీ మాటికీ చడ్డీ బనియన్, చడ్డీ బనియన్ అంటుంటే.. విసుగుపుడుతుంది. అర్దాంతరంగా ఆ పాత్రను ముగించి సినిమాని మళ్ళీ నీలాసంలోకి నెట్టేసినట్లు అయ్యింది.

7) సాంగ్స్ విషయంలో ప్రీతమ్ కు మంచి మార్కులు వేయొచ్చు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తనూజ్ టికు డిజప్పాయింట్ చేశాడు.

8) క్లైమాక్స్ లో హీరోయిన్ వెళ్ళిపోయినప్పుడు ఆమిర్ ఖాన్ 4 రోజుల పాటు పరిగెడుతూనే ఉంటాడు. ఆ సీన్ చూస్తే మనకు ఆయాసం వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

9) ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. మన టాలీవుడ్ దర్శకులు అయిన రాజమౌళి, సుకుమార్, వంటి వారికి స్పెషల్ గా షో వేసినప్పుడు వాళ్ళు దీని గురించి ఏమీ చెప్పలేదా అనే డౌట్ కూడా అందరికీ కలుగుతుంది..!

10) క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు ఏమాత్రం బాగోదు.. శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అనే ప్రేక్షకుడు ఎదురుచూస్తూ ఉంటాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus