తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ చిత్రం ఇటీవల అంటే సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ కమ్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ వంటివి ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.గౌర హరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ’ అనే పాట కూడా బాగా సౌండ్ చేసింది అని చెప్పాలి.
‘ ‘మిరాయ్’ అనే ఒక సినిమా వస్తుంది’ అని చెప్పి.. అందరికీ పదే పదే గుర్తు చేసింది ఈ పాటే. వినాయక చవితి సంబరాల్లో భాగంగా ప్రతి వీధిలో పెట్టిన మైకుల్లో ఈ పాట ఎక్కువగానే వినిపించింది. అయితే సినిమాలో ఈ పాట లేకపోవడంతో ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా వేశారు.
ఈ విషయం పై చిత్ర బృందం కూడా స్పందించి.. ‘సినిమా మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా ‘వైబ్ ఉంది’ సాంగ్ తో పాటు నిధి అగర్వాల్ పై చిత్రీకరించిన మరో పాటను కూడా డిలీట్ చేసినట్లు’ క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి సినిమాలో ఈ పాట పెట్టే స్పేస్ ఉంది. కానీ చిత్ర బృందం అలా చెప్పారు అంటే అది ‘వాళ్ళ కాల్’ అని అంతా కన్విన్స్ అయ్యారు.అయితే సడన్ గా ఇప్పుడు ‘వైబ్ ఉంది’ సాంగ్ ని కలిపినట్టు ప్రకటించి మరో షాక్ ఇచ్చారు.
‘రిపీట్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించాలి’ అనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ మరోపక్క ‘ఓజి’ మేనియా మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. 99 శాతం థియేటర్స్ ‘ఓజి’ తో ఆకుపై అయిపోతాయి. ఇలాంటి టైంలో ఓ పాట కోసం ‘మిరాయ్’ ని మళ్ళీ థియేటర్లో చూడాలి అని ప్రేక్షకులు ఎందుకు అనుకుంటారు. ఈ యాడ్ చేసేది ఏదో 2వ వీకెండ్ కి యాడ్ చేసి ఉన్నా.. కొంచెం వసూళ్లు పెరిగేవి కదా.?