Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

ఒక్కోసారి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్నప్పుడు కొన్ని చిన్న సినిమాలు లేదా అంచనాలు లేని కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యి ఘన విజయాలు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు అవి పెద్ద సినిమాల కలెక్షన్స్ ను దెబ్బ తీసి రికార్డులు కొట్టాయి. ఇప్పుడు అలాంటి టాపిక్ గురించే మనం చెప్పుకోబోతున్నాం. 3 ఏళ్ళ క్రితం అంటే.. 2022 అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా రిలీజ్ అయ్యింది.

Godfather, OG

ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. టికెట్ రేట్లు వంటి హైక్స్ జోలికి పోకుండా సాధారణ రేట్లకే సినిమాని రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ స్టడీగా ఉండటంతో టీం అంతా హ్యాపీగా ఉన్నారు. సెకండ్ వీకెండ్ కి ‘గాడ్ ఫాదర్’ మళ్ళీ పుంజుకుంటుంది అనుకునే టైంలో ‘కాంతార’ రిలీజ్ అయ్యింది. కన్నడలో సెప్టెంబర్ 30 నే రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

2 వారాల తర్వాత తెలుగులో డబ్ చేశారు కాబట్టి.. ‘కాంతార’ అంతగా ఆడదేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్స్ తో థియేటర్స్ అన్నీ ప్యాచ్ చేసింది. ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ ని డామినేట్ చేసేసింది. ఆ సినిమాకి షోలు తగ్గించేసి మరీ ‘కాంతార’ షోలు పెంచాల్సి వచ్చింది. బ్రేక్ ఈవెన్ సంగతి ఎలా ఉన్నా.. ‘గాడ్ ఫాదర్’ కలెక్షన్స్ చాలా వరకు ‘కాంతార’ వల్ల దెబ్బ తిన్నాయి.

3 ఏళ్ళ తర్వాత కూడా ఆల్మోస్ట్ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పాలి. కాకపోతే అప్పుడు అన్నయ్య చిరంజీవి ఇబ్బంది పడితే.. ఈసారి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ఇబ్బంది పడుతుంది. అవును ఇటీవల పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా రిలీజ్ అయ్యింది. దానికి మంచి టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే టైంలో ‘కాంతార చాప్టర్ 1’ వచ్చింది. దీనికి కూడా పాజిటివ్ టాక్ రావడంతో.. ‘ఓజి’ కలెక్షన్స్ పై ప్రభావం గట్టిగా పడింది.

‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus