తేజ సజ్జ (Teja Sajja) ‘హనుమాన్’ తో (Hanu-Man) పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. మార్కెట్ కూడా పది రెట్లు పెరిగింది. అతని నెక్స్ట్ సినిమాగా ‘మిరాయ్’ (Mirai) రాబోతుంది. ఇది ఒక హిస్టారికల్ అండ్ అడ్వెంచరస్ మూవీ. ‘ఈగల్’ (Eagle) ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకుడు. ఆగస్టు 1న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 5 కి వాయిదా పడింది. దీన్ని తెలుపుతూ ఒక టీజర్ ను కూడా వదిలారు.
ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘జరగబోయేది మారణహోమం.. శిధిలం కాబోతోంది అశోకుడి ఆశయం’ అనే పవర్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత అశోకుడికి సంబంధించిన కొన్ని వార్ ఎపిసోడ్స్ చూపించారు. ‘కలియుగంలో పుట్టిన శక్తి దీన్ని ఆపలేదు’ అనే డైలాగ్ వచ్చినప్పుడు విలన్ మంచు మనోజ్ (Manchu Manoj) ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత అతని రాక్షసత్వాన్ని చూపించారు.
ఆ వెంటనే ఈ ప్రమాదాన్ని ఆపే దారి లేదా అన్నప్పుడు ‘ ‘మిరాయ్’ అనే ఆయుధం’ గురించి చెప్పడం.. ఆ టైం హీరో తేజ సజ్జ ఎంట్రీ ఇచ్చి ఫైట్ సీక్వెన్స్ లతో తన వీరత్వాన్ని చూపించడం జరిగింది. అలా కథపై కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీజర్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. నిర్మాతలు పెట్టిన బడ్జెట్ టీజర్లోని ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :