Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా స్పై థ్రిల్లర్ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈథన్ హంట్ పాత్రలో టామ్ క్రూజ్ చేసే సాహస విన్యాసాలు అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఏడు సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు సిరీస్‌లో చివరి భాగమైన ‘మిషన్ ఇంపాజిబుల్: ఫైనల్ రికనింగ్’ (Mission Impossible 8) సినిమా భారత్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Mission Impossible 8

ఈ సినిమా మే 17, 2025న విడుదల కానుంది, రిలీజ్‌కు ముందే టికెట్ సేల్స్ ఊపందుకోవడం ఈ సిరీస్ క్రేజ్‌ను తెలియజేస్తోంది. భారత్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్: ఫైనల్ రికనింగ్’ (Mission Impossible 8) సినిమా టికెట్ సేల్స్ జోరుగా సాగుతోంది. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ లాంటి టాప్ థియేట్రికల్ చైన్స్‌లో మొదటి రోజు 10,000 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. వీకెండ్‌లో రోజుకు 15,000 టికెట్లు సేల్ అవుతున్నాయని అంచనా. మొత్తంగా ఆన్‌లైన్, ఇతర మార్గాల్లో 1.25 లక్షల టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలి రోజు భారత్‌లో రూ.17-20 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గతంలో సిరీస్‌లోని 7వ భాగం ‘డెడ్ రికనింగ్’ రూ.13 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో, ఈసారి ఈ సిరీస్‌లోనే అత్యధిక తొలి రోజు వసూళ్లను ‘ఫైనల్ రికనింగ్’ సాధించేలా కనిపిస్తోంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ సినిమాలు ప్రచార ఖర్చు లేకుండానే భారీ ఓపెనింగ్స్ సాధించడంలో ఎప్పుడూ ముందుంటాయి. ఈ సిరీస్‌లోని సాహస విన్యాసాలు, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తాయి. ఈసారి ‘ఫైనల్ రికనింగ్’ సినిమా కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, వీకెండ్‌లో (శని, ఆదివారాలు) భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. భారత్‌లో స్పై థ్రిల్లర్, యాక్షన్ జోనర్ సినిమాలకు ఎప్పుడూ భారీ క్రేజ్ ఉంటుంది. ‘అవతార్’, ‘అవెంజర్స్’, ‘సూపర్‌మ్యాన్’ లాంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలు ఇక్కడ రూ.100 కోట్ల వసూళ్లను సునాయాసంగా సాధించాయి. ‘అవతార్’ సినిమా భారత్‌లో మూడు దఫాలుగా విడుదలై రూ.300 కోట్లను కూడా వసూలు చేసింది. అలాగే, జేమ్స్ బాండ్ సిరీస్ కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. స్పై జోనర్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ ఈసారి కూడా ‘ఫైనల్ రికనింగ్’తో కొనసాగనుంది.

పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus