Adi Reddy: సామాన్యుడిగా వచ్చిన ఆదిరెడ్డి చేసిన తప్పులేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ జెర్నీలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. రేవంత్, శ్రీసత్య జెర్నీలు అయిపోయిన తర్వాత ఆదిరెడ్డి జెర్నీ మొదలైంది. ఆదిరెడ్డి గురించి బిగ్ బాస్ చెప్పిన స్క్రిప్ట్, వాళ్లు వైఫ్ కవిత చెప్పిన విషెష్ మంచి బూస్టప్ ఇచ్చాయి. ఫైనల్ డే వరకూ బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నందుకు ఆదిరెడ్డి చాలా గర్వపడిపోయాడు. అంతేకాదు, బిగ్ బాస్ తన జెర్నీ చూపిస్తున్నప్పుడు కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు.

ఇక ఆదిరెడ్డి జెర్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సామాన్యుడిగా వచ్చి పోరాడి ఇప్పుడు ఫైనల్స్ వరకూ వచ్చాడంటే అది మాములు విషయం కాదు. బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల మద్యలో నిలిచి తన గేమ్ స్టైల్ ని చూపించాడు. ఆదిరెడ్డి జెర్నీలు అక్కడక్కడ మిస్టేక్స్ కూడా కనిపించాయి. ఈవిషయాన్ని బిగ్ బాస్ కూడా స్క్రిప్ట్ లో చెప్పాడు. అయితే, వాటిని ఒప్పుకుని ధైర్యంగా ముందడుగు వేశాడంటూ చెప్పాడు. ఒక్కసారి జెర్నీలో హైలెట్స్ చూసినట్లయితే.,

ఆదిరెడ్డి ఫస్ట్ వీక్ నుంచీ కూడా గేమ్ లోనే ఉన్నాడు. అయితే, కొన్ని వారాలు గీతుతో కలిసి స్ట్రాటజీలు ప్లే చేయడం అనేది మైనస్ అయ్యింది. ఇక ఇనయ గేమ్ ని కామెంట్స్ చేయడం, మెరీనా – రోహిత్ కపుల్ ని టార్గెట్ చేయడం చేశాడు. హౌస్ లో హౌస్ మేట్స్ తో ఒకవైపు మాత్రమే ఉండిపోయాడు. రెండోవైపు రాలేకపోయాడు. ర్రాజ్, పైమా, సూర్య, గీతు వీళ్లతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేశాడు.

ఇదే గేమ్ లో మైనస్ అయ్యింది. ఇక టాస్క్ లలో బాగా ఆడటం, తన స్ట్రాటజీలు వర్కౌట్ చేయడం బాగా చేశాడు. చేపల టాస్క్ లో ఎప్పుడైతే గీతుతో గొడవ పడ్డాడో అప్పట్నుంచీ ఆదిరెడ్డిని చాలామంది లైక్ చేశారు. బ్యాటరీ టాస్క్ ఉపయోగించి వాళ్ల వైఫ్ తో మాట్లాడటం, తన వైఫ్ , పాప ఇద్దరూ రావడం, వాళ్ల చెల్లి నాగలక్ష్మి స్టేజ్ పైకి రావడం ఇవన్నీ ఆదిరెడ్డికి మంచి బూస్టప్ ఇచ్చాయి.

ఇప్పుడు ఆటలో ముందుకు వెళుతూ టైటిల్ పై కన్నేశాడు ఆదిరెడ్డి. ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా టైటిల్ రేస్ లో ఉంటాడు అనడంలో సందేహం లేదు. సామాన్యుడిగా వచ్చి ఇప్పుడు ఇంతమంది ఆడియన్స్ ని గెలుచుకున్నాడు ఆదిరెడ్డి. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus