Mitraaw Sharma: షాక్ ఇస్తున్న మిత్ర శర్మ ఆస్తుల లెక్కలు.. ఖరీదైన కార్లు!

ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో సరికొత్త కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మిత్ర శర్మ రోజురోజుకు తన ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను గట్టిగానే పెంచుకుంటుంది. అయితే మొదట ఈ మోడల్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు ఎక్కువ కాలం కొనసాగదు అని చాలామంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. అంతేకాకుండా హౌస్ లో ఉన్న వారు కూడా ఆమె వారం రోజుల తర్వాత తప్పకుండా ఎలిమినేట్ అవుతుంది అని పరోక్షంగా నవ్వుకున్నారు.

Click Here To Watch NEW Trailer

కానీ మిత్రశర్మ మాత్రం అస్సలు తగ్గకుండా కంటెస్టెంట్స్ కు పోటీగా తన శక్తినంతా ఉపయోగిస్తోంది. అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే వరకు కూడా ఎవరికీ అంతగా తెలియదు. రెండు మూడు సినిమాలు చేసినట్లు కూడా చెప్పింది కానీ ఆ సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయని కూడా ఎవరికీ తెలియదు. దీంతో ఆమె చాలా మిడిల్ క్లాస్ లేదా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బిగ్ బాస్ లోకి వచ్చినట్లుగా కామెంట్స్ కూడా వచ్చాయి.

కానీ ఆమె అసలు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. హైదరాబాదులోనే ఇంద్రభవనం లాంటి ఇల్లు కలిగిన మిత్ర శర్మ ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంటోంది. అంతే కాకుండా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. కారు అంటే ఏదో సాధారణమైన కారు కాదు. దాని విలువ కోటి 20 లక్షలు ఉంటుంది అని తెలుస్తోంది. అది బెంజ్ ఆల్టర్ కారు అని సమాచారం. ఈ లగ్జరీ కారు ఇండియాలో కేవలం ఒక పది మంది దగ్గర మాత్రమే ఉండగా అందులో ఒకటి హైదరాబాద్లో మిత్రశర్మ దగ్గర ఉండడం విశేషం.

ఆ కారు నెంబరుకు 999 ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది. మిత్రశర్మ తన తండ్రితో కలిసి కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రొడక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేసింది. ఆ తర్వాత తండ్రి మరణించడంతో హైదరాబాదులో కి షిఫ్ట్ అయ్యి సొంతంగా శ్రీ పిక్చర్స్ అనే సంస్థను కూడా స్థాపించింది. పలు బిజినెస్ లతో ఆమె కోట్లు సంపాదించింది. ఇక తనే సొంతంగా సినిమాలు నిర్మించుకుంటూ వీలైతే హీరోయిన్ గా క్లిక్కవ్వాలని మిత్రశర్మ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. మరి బిగ్ బాస్ ద్వారా ఆమె ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus