Mitraaw Sharma: ‘మిత్ర’ వాళ్లకి సరైన సమాధానం చెప్పిందా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో మిత్రాశర్మా సివంగిలా రెచ్చిపోయింది. హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ లో దెబ్బలని భరిస్తూ, గాయాలని ఓర్చుకుంటూ ఒక రేంజ్ లో గేమ్ ఆడింది. ముగ్గురు కలిసి టార్గెట్ చేసి మిత్రా మీదకి వచ్చినా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా గేమ్ ఆడింది. మాటలతో వారిని డైవర్ట్ చేస్తూ, వారికి ఎక్కడా కూడా చేపపిల్లలా చిక్కకుండా తన చేతులని కాపాడుకుంది. నిజానికి రెండు చేతులకి పెయింట్ పూయలేక ఏలియన్స్ అలసిపోయారు.

Click Here To Watch NOW

అయితే, మిత్రాని బలవంతంగా కొట్టి మరీ చేతులని లాక్కున్న ఏలియన్స్ టీమ్ ఒక చేతికి మాత్రమే పెయింట్ పూయగలిగారు. ఈ టైమ్ లో హ్యూమన్స్ నుంచీ సపోర్ట్ లేకపోయనా సోలోగా పోరాడింది మిత్రా శర్మా. గుండెలపై కాళ్లతో తంతున్నా ఓర్చుకుంటూ, వీపుపై కూర్చుని గట్టిగా కొడుతున్నా సహిస్తూ, గొంతు పట్టుకుని గట్టిగా బిగిస్తున్నా భరిస్తూ గేమ్ లో తన పవర్ ని చూపించింది. తన గేమ్ చూసినవాళ్ల అందరూ ఇప్పుడు ఇన్సిపైయిర్ అయిపోతున్నారు.

ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్ గా మారిన మిత్రా శర్మాకి ఇప్పుడు హౌస్ లో వ్యతిరేఖత ఉన్నా కూడా బయట బిగ్ బాస్ లవర్స్ ని మాత్రం పెంచుకుంటోంది. మిత్రా శర్మా మొదటి నుంచీ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ వచ్చింది. ఒంటరిగానే టాస్క్ లలో పోరాడింది. ఫస్ట్ వీక్స్ లో తనని ఎవరూ కన్సిడర్ చేయకపోయినా కూడా టాస్క్ లో వంద శాతం పెర్ఫామ్ చేసేందుకు ట్రై చేసేది. అలాగే, ఇప్పుడు హ్యూమన్స్ తరపున ఆడిన మిత్రా శర్మా తనని టార్గెట్ చేస్తున్నారని తెలిసి కూడా గేమ్ లో సివంగిలా కలయబడింది.

సోలో ఫైటర్ అని మరోసారి నిరూపించింది. మిత్రా అంటే ఫైర్ అని, మిత్రా అంటే ఏదైనా సాధిస్తుందని, ఎక్కడా కూడా గేమ్ లో గివ్ అప్ ఇవ్వదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు, తనని గేమ్ ఆడవు అని చెప్పి నామినేట్ చేసిన వాళ్ల అందరికీ ఇప్పుడు సమాధానం చెప్పినట్లుగా అయ్యింది. టాస్క్ లో తన పెర్ఫామన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. హ్యూమన్స్ టాస్క్ లో మిత్రా గేమ్ చూసి ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ మిత్రాకి లవర్స్ గా మారిపోయారు. సివంగి మిత్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా తనని తాను ప్రొటక్ట్ చేసుకున్న తీరుకి అందరూ ఇన్సిపైయిర్ అయిపోతున్నారు. ఏలియన్స్ టీమ్ నుంచీ ముగ్గురు ఎటాక్ చేస్తున్నా సోలోగా ఒంటరిగా వారిని ఎదిరించింది మిత్రా. ఒకానొక దశలో మిత్రా లొంగకపోయేసరికి ముగ్గురు ఏలియన్స్ గేమ్ నుంచీ బయటకి వచ్చేశారు. మిత్రాని వదిలేసి అనిల్, శివలపై పడ్డారు. దీన్ని బట్టి మిత్రా శర్మా టాస్క్ లో ఎంతలా పోరాడిందో అర్ధమవుతోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిన మిత్రాశర్మా ఇప్పుడు టైటిల్ రేసులో దూసుకుపోతోంది. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus