Bigg Boss: ఎలాంటి ఫేమ్ లేకుండా వచ్చి ఫినాలే వరకూ వెళ్లారు..! గేమ్ ఎలా ఆడారంటే..?

  • May 17, 2022 / 10:48 AM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హౌస్ మేట్స్ ఫేమ్ ని సంపాదించారు. ముఖ్యంగా మిత్రా శర్మా, యాంకర్ శివ, మోడల్ అనిల్ ముగ్గురూ కూడా ఫినాలే వరకూ చేరుకున్నారు. అసలు ఈ సీజన్ ఓటీటీలో ఎలా నడుస్తుంది అనుకునేవాళ్లకి మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చారు. మిత్రా శర్మా నామినేషన్స్ లో పులిలా రెచ్చిపోయింది. తనదైన స్టైల్లో యాష్ ట్యాగ్ డ్రామా చేస్తూ హౌస్ మేట్స్ ని, ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసింది.

మొదట్లో మిత్రాశర్మా ఆట తీరు చూసి హౌస్ మేట్స్ ఖంగుతిన్నారు. అసలు ఏం గేమ్ ఆడుతోంది అర్ధం కావట్లేదని, ఒకటి మాట్లాడితే ఇంకోటి చెప్తోందని, అసలు గేమ్ లో – నామినేషన్స్ లో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదని అన్నారు. కానీ, తనదైన స్టైల్ తోనే బయట ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రతివారం కొత్తగా కనిపిస్తూ తన గేమ్ ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. టాస్క్ లలో బలంగా కనిపించి ప్రత్యర్ధులకి కొరకరాని కొయ్యగా మారింది.

ఇక యాంకర్ శివ కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యాడు. టాస్క్ లలో బాగా ఆడుతూ, ప్రతిసారి కెప్టెన్ పోటీదారులకి ఎంపిక అయ్యాడు. దీంతో ఆడియన్స్ శివకి ఓట్ వేయడం అనేది మొదలుపెట్టారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కొద్దిగా ఫేమ్ ఉన్నా కూడా కాంట్రవర్సీ శివగానే అందరికీ తెలుసు. కానీ, హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎంటర్ టైన్మెంట్ కూడా చేయగలనని నిరూపించాడు. అప్పుడప్పుడు నోరు జారినా కూడా తర్వాత దాన్ని గుర్తించి సారీ చెప్పాడు.

టాస్క్ లో పెర్ఫామన్స్ పీక్స్ లో ఉండటం, అఖిల్, అనిల్ , తేజస్వి, నటరాజ్ మాస్టర్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కి పోటీ ఇవ్వడంలో శివ సక్సెస్ అయ్యాడు. ఎక్కడికక్కడ స్ట్రాటజీలు అప్లై చేస్తూ, ఎప్పటికప్పుడు ఆడియన్స్ హృదయాలని గెలుచుకున్నాడు. యాంకర్ శివతో పాటుగా, మోడల్ అనిల్ కూడా తన స్టైల్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ప్రతి వారం డేంజర్ జోన్ లో ఉన్నా కూడా సేఫ్ అవుతూ ఫినాలే వరకూ వచ్చాడు.

అసలు ఎలాంటి ఇమేజ్, క్రేజ్ లేకుండా వచ్చి ఇప్పుడు తనకంటూ ఒక పేరుని సంపాదించాడు. మోడల్ గా వచ్చిన ఈ కుర్రాడు టాస్క్ లలో ఇరగదీసి మరీ పెర్ఫామ్ చేశాడు. దీంతో ప్రేక్షకులకి బాగా నచ్చాడు. డేంజర్ జోన్ నుంచీ సేఫ్ జోన్ లోకి తీస్కుని వచ్చారు. వీళ్ల ముగ్గురు ఎలాంటి అంచనాలు లేకుండా ఇప్పుడు ఫినాలేలోకి అడుగుపెట్టడం అనేది మాములు విషయం కాదు. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus