Keeravani Father: కీరవాణికి పితృ వియోగం..!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్నాళ్లుగా పాపులర్ నటీనటులు మరణిస్తూ వస్తున్నారు. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్‌ టామ్‌ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను, నటి, మోడల్ అయిన షెఫాలీ జరీవాలా వంటి సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు.

Keeravani Father Shiva Shakti Datta

ఇప్పుడు టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. కీరవాణి (Keeravani) తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు. కొన్నాళ్లుగా ఆయన వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ వస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో నిన్న(జూలై 7న) రాత్రి 9: 30 గంటల సమయంలో ఆయన మరణించినట్లు సమాచారం. ఈ విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కీరవాణి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తుంది. రాజమౌళి దంపతులు కూడా మహేష్ బాబు సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ శివశక్తి దత్తా గారికి నివాళులు అర్పించేందుకు వెళ్లారని తెలుస్తుంది. టాలీవుడ్లో ఉన్న చాలామంది సెలబ్రిటీలు శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తన సానుభూతి తెలుపుతున్నారు.

శివ శక్తి దత్తా ‘చంద్రహాస్’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ‘జానకి రాముడు’ అనే సినిమాకి కథా రచయితగా వ్యవహరించారు. ‘సై’ ‘ఛత్రపతి’ ‘రాజన్న’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘సవ్యసాచి’ ‘జాంబీ రెడ్డి’ ‘ఆర్ఆర్ఆర్’ ‘హనుమాన్’ వంటి సినిమాలకి పాటల రచయితగా కూడా పనిచేశారు.

‘పూరీ -సేతుపతి’.. ప్రాజెక్టు డిలే అవ్వడానికి కారణం అదేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus