MM Keeravani: మహేష్ రాజమౌళి మూవీ షాకింగ్ అప్ డేట్ వైరల్.. ఏం చెప్పారంటే?

  • June 24, 2024 / 07:16 PM IST

మహేష్ (Mahesh Babu) రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ (RRR) మూవీ విడుదలై దాదాపుగా రెండు సంవత్సరాలు కావడంతో రాజమౌళి తర్వాత సినిమా పనులు వేగంగా మొదలుపెడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్ రాలేదు.

ఈ ప్రాజెక్ట్ గురించి కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేష్ జక్కన్న మూవీ స్టోరీ లాక్ అయిందని కీరవాణి పేర్కొన్నారు. నేను ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టలేదని కీరవాణి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారని జులై లేదా ఆగష్టులో నా పనిని మొదలుపెడతానని ఆయన చెప్పుకొచ్చారు.

కీరవాణి ఇచ్చిన అప్ డేట్ విని షాకవ్వడం ఫ్యాన్స్ వంతవుతోంది. రాజమౌళి ప్రతి సినిమా విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. అందువల్ల ఈ సినిమా 2027 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇండియనా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా కష్టపడ్డారని భోగట్టా.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. రాజమౌళి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించి ఏమైనా చెబుతారేమో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయనుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus