సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.!

సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఇంకా వింటూనే ఉన్నాం.2024 లో చూసుకుంటే.. అప్పుడే చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. అప్పుడే ‘బేబీ’ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ తండ్రి మరణించారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్‌ కూడా మరణించడం జరిగింది.

ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటుడు మరణించడం అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్‌లో ఇంద్ర తమ్ముడిగా నటించిన పవిత్రనాథ్‌. ‘మొగలిరేకులు’ సీరియల్లో అయితే దయ అనే అమాయకుడు పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సీరియల్ చివర్లో అతని పాత్ర బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ నటుడు (Pavitranath) నిజజీవితంలో కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘‘పవి.. చాలా బాధ పెడుతున్నావ్. దాన్ని మాటల్లో కొలవలేకపోతున్నాను. మా జీవితంలో నువ్వు చాలా ప్రత్యేకం. ఈ వార్త తెలిసినప్పటి నుండి ఇది నిజం కాకూడదని.. కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుంటుంది అనుకున్నాను.

కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాను. కనీసం నిన్ను చివరిసారి చూసుకోలేకపోయాను. క్షమించు.ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాం” అంటూ ఎమోషనల్ గా తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చింది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus