బ్యాంకు దొంగతనం చేయడానికి రెడీ అవుతున్న మోహన్ బాబు

  • October 4, 2019 / 04:10 PM IST

కుటుంబపరమైన ఇబ్బందులు మరియు ఆర్ధిక లావాదేవీల కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ ఒక హిట్ సినిమాతో తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే.. తను ఈ వయసులో యాక్షన్ సినిమాలు గట్రా చేయడం కంటే.. తన వయసుకు తగ్గ పాత్ర చేయడం మేలని భావించారట. అందుకే.. హాలీవుడ్ లో మంచి విజయం అందుకొన్న “గోయింగ్ ఇన్ స్టైల్” అనే సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మోహన్ బాబు.

పెన్షన్ అందుకునే వయసులో.. ఓ నలుగురు వ్యక్తులు కలిసి తమకు పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించిన బ్యాంక్ ను దోపిడీ చేస్తారు. ఇదే సినిమా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది తెలియదు కానీ.. నిర్మాణం మాత్రం లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. మోహన్ బాబు స్నేహితులుగా రాజేంద్రప్రసాద్, రావు రమేష్ లు నటించే అవకాశం ఉంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus