Mohan Babu: పవన్ నటనపై కలెక్షన్ కింగ్ ఏమన్నారంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా గత నెల 30వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వేర్వేరు కారణాల వల్ల థియేటర్లలో సినిమా చూడటం మిస్సైన ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూస్తున్నారు. అయితే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వకీల్ సాబ్ సినిమాను చూసి షాకింగ్ కామెంట్లు చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటనకు తాను ముగ్ధుడినయ్యానని తెలుగులో ఇలాంటి మంచి సినిమాను తీసిన దర్శకనిర్మాతలు అభినందనీయులని మోహన్ బాబు సన్నిహితుల దగ్గర చెప్పారని తెలుస్తోంది.

మంచి సందేశంతో కూడిన వకీల్ సాబ్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని స్త్రీ గొప్పదనం తెలిపే సినిమాలు సమాజానికి అవసరమని మోహన్ బాబు అభిప్రాయపడ్డారని సమాచారం. మోహన్ బాబు పవన్ నటనను మెచ్చుకున్నారని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని మోహన్ బాబు ఇండస్ట్రీలో సత్తా చాటారు. తన నటనతో ఎంతోమంది ప్రముఖ డైరెక్టర్ల నుంచి మోహన్ బాబు నటుడిగా ప్రశంసలు పొందారు.

ఈ మధ్య కాలంలో మోహన్ బాబు ప్రశంసించిన సినిమా వకీల్ సాబ్ మాత్రమే కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించి మోహన్ బాబుతో ప్రశంసలను అందుకోవడం గమనార్హం. మరోవైపు మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియాలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus