ఆయన విగ్రహాన్ని మట్టితోనా ప్రతిష్టించేది ?
- May 15, 2018 / 02:55 PM ISTByFilmy Focus
ఇటీవల దాసరి జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఫిలిమ్ నగర్ లో ఏర్పాటు చేయడంతోపాటు.. ఆయన జన్మదినాన్ని దర్శకుల దినంగా ప్రకటించడం పట్ల ఇండస్ట్రీ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. కానీ.. ఈ పరిణామం పట్ల మోహన్ బాబు కోపం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. దాసరి స్వయంగా ఇంట్రడ్యూస్ చేయడంతోపాటు దాసరి దర్శకత్వంలో సినిమాలు కూడా నిర్మించిన మోహన్ బాబును కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ ఈ విగ్రహ ఆవిష్కరణకు పిలవలేదు.
అంతే కాకుండా దాసరి లాంటి మహోన్నతమైన మనిషికి ప్రతిరూపమైన విగ్రహాన్ని కాంస్యంతో చేయించాలి కానీ ఇలా ఇసుక, సిమెంట్ తో చేయించడం ఏమిటి అంటూ నిప్పులు చెరిగారు. ఒకవేళ ఆర్ధిక సహాయం కనుక నన్ను అడిగి ఉంటే ఎంతైనా ఇచ్చేవాడ్ని కదా అని చినబుచ్చుకున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















