Mohan Babu, Rajinikanth: మోహన్ బాబు, రజినీకాంత్..ల లేటెస్ట్ పిక్ వైరల్.!

  • July 5, 2024 / 12:12 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)..ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకేసారి వీరిద్దరూ కలిసి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్న రోజుల్లో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. చాలా తెలుగు సినిమాల్లో రజినీకాంత్ కూడా నటించారు. బెంగళూరుకి చెందిన వ్యక్తే అయినప్పటికీ తమిళంలో ఆదరణ పొందారు రజినీకాంత్. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన టైంలో రజనీ ఎటువైపు ఉండాలా అనే డైలమాలో పడ్డారు.

అప్పుడు ‘నిన్ను ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకుల్ని వదులుకోకు’ అని మోహన్ బాబు చెప్పడం జరిగింది. మోహన్ బాబు చెప్పిన ఆ ఒక్క మాట రజినీకాంత్ ని అక్కడ సూపర్ స్టార్ ని చేసింది. అలాగే మిగిలిన భాషల్లో కూడా ఆయన స్టార్ గా నిలబడటానికి అది సాయపడింది. ఇక మోహన్ బాబు కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్న టైంలో ‘నట్టమై’ అనే తమిళ సినిమా రీమేక్ రైట్స్ తీసుకోమని రజనీ చెప్పడంతో..

దానిని ‘పెదరాయుడు’ గా రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు మోహన్ బాబు. అలాగే ఆ సినిమాలో రజినీకాంత్ కూడా కీలక పాత్ర పోషించారు. అది కూడా ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా. వీరి మధ్య ఉన్న స్నేహం అలాంటిది. ఇక రజినీకాంత్ హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా.. మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా చెన్నై ఫ్లైట్ ఎక్కరు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ మరోసారి కలిశారు. ఫ్లైట్ లో వీరిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నట్టు ఓ ఫోటో బయటకు వచ్చింది. దీనిని మోహన్ బాబు ట్విట్టర్లో షేర్ చేసి ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం…’ అంటూ రాసుకొచ్చారు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus