కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ – న్యూ ఏజ్ డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరీ కాంబినేషన్ లో ‘మలైకొట్టై వలిబన్’

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నూతన చిత్రం న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలున్నాయి. గత కొన్ని రోజులుగా చిత్ర టైటిల్ కి సంబంధించి రకరకాల వార్తలతో మేకర్స్ ఆసక్తి రేకెత్తించారు. ఎట్టకేలకు చిత్ర టైటిల్ ను మలైకొట్టై వలిబన్ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) గా ప్రకటించారు.

మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరి కాంబినేషన్ మీద సినీ ప్రియులకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోహన్ లాల్ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగల టాలెంట్ ఆయన సొంతం. లిజో కూడా విభిన్న కథాంశాలతో కూడా చిత్రాలతో, మనిషి మనస్తత్వాలను భిన్నకోణంలో ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న దర్శకుడు. వీళ్లిద్దరి కలయికలో చిత్రం అంటే అంచనాలు తారాస్థాయిలో ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చిత్రం ఉండబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

జనవరి నుండి చిత్రీకరణ ప్రారంభం కానున్న చిత్రం షూటింగ్ దాదాపు రాజస్థాన్ లోనే జరుపుకోనుంది. మోహన్ లాల్ రెజ్లర్ గా నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus