Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

  • December 30, 2025 / 05:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సీనియర్ నటుడు మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అత్యంత ప్రియమైన తల్లి శాంతకుమారి (90) నేడు తుదిశ్వాస విడిచారు. వయసు పైబడటంతో పాటు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి చేరినట్లు సమాచారం. అయితే ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఎర్నాకులం జిల్లా ఎలమక్కరలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆ సమయంలో మోహన్‌లాల్ కొచ్చిలోనే ఉన్నారు.

తల్లి మరణ వార్త అందుకున్న వెంటనే మోహన్‌లాల్‌తో పాటు కుటుంబ సభ్యులు అంతా ఎర్నాకులం చేరుకున్నారు. శాంతకుమారి అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త వెలువడగానే మలయాళంతో పాటు ఇతర భాషల సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

మోహన్‌లాల్‌కు తన తల్లి అంటే ఎంతటి ప్రేమ, గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో ఆమెతో ఉన్న జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునేవారు. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. అంతేకాదు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న వెంటనే నేరుగా తల్లిని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న ఘటన అభిమానులను కదిలించింది.

ఇలాంటి సమయంలో మాతృవియోగం కలగడం మోహన్‌లాల్‌కే కాదు, ఆయనను అభిమానించే కోట్లాది మందిని కూడా విషాదంలో ముంచెత్తింది. మరోవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్న మోహన్‌లాల్ ఇటీవల వృషభ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యక్తిగత నష్టం ఆయన మనసును ఎంతగానో కలచివేస్తోంది. అభిమానులు ఆయనకు ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తూ శాంతకుమారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

31 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

60 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version