Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

ఇండియన్‌ సినిమా హీరోల్లో ఫ్రెండ్స్‌ చాలా మంది ఉండొచ్చు. కానీ మలయాళ స్టార్‌ హీరోలు మమ్ముట్టి, మోహన్‌ లాల్‌ స్నేహం మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌. ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులనగానే వారి పేర్లే గుర్తొచ్చేలా స్నేహం చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. ఒకరిపై ఒకరు తరచుగా తమ స్నేహాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. అలా తన ప్రాణ స్నేహితుడిపై అభిమానాన్ని మోహన్‌ లాల్‌ మరోసారి చూపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అది చూసి ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

Mohanlal

మమ్ముట్టి ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు కోలుకున్నారని, మరికొన్ని రోజుల్లో షూటింగ్‌లో పాల్గొంటారని మాలీవుడ్‌ సమాచారం. ఇప్పుడు అదే విషయాన్ని మోహన్‌ లాల్‌ పరోక్షంగా సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఇద్దరూ ఓ సందర్భంలో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. లవ్‌ సింబల్‌, ఆనందం ఎమోజీలను యాడ్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు లాలెటన్‌. ఆ ఫొటోతో వారి మధ్య ఉన్న ఆత్మీయ స్నేహబంధం మరోసారి విరిసింది.

గతంలో మమ్ముట్టి ఆరోగ్యంపై వార్తలు వచ్చినప్పుడు శబరిమలలో మోహన్‌ లాల్‌ ప్రత్యేక పూజలు చేసి.. మమ్ముక్క త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు ధైర్యాన్నిచ్చారు కూడా. మరోవైపు మమ్ముట్టి కోలుకున్నారని.. మీ అందరి ప్రార్థనలు ఫలించాయని.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం అని మమ్ముక్కు స్నేహితులు, సన్నిహితులు వివిధ రకాలు అభిమానులకు సమాచారాన్ని ఇస్తున్నారు.

ఇక మమ్ముట్టి సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ‘కళంకావల్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. జితిన్‌ దర్శకత్వంలో క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో షూటింగ్‌ మొదలైతే.. మమ్ముట్టి తెరపై చూద్దామని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మమ్ముక్క మీడియా ముందుకు వచ్చే రోజు త్వరలోనే అనౌన్స్‌ చేస్తారని సమాచారం. అప్పుడే ఆయనకు ఏమైందో తెలిసే అవకాశం ఉంది.

ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus