Mokshagna: అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన బాలయ్య!

  • July 19, 2021 / 08:20 AM IST

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి కొడుకు రామ్ చరణ్, మరో సీనియర్ స్టార్ హీరో నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ వరుసగా సినిమాల్లో నటిస్తూ నటులుగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని గతంలో వార్తలు వైరల్ అయినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే బాలకృష్ణ తాజాగా మోక్షజ్ఞ 2023 సంవత్సరంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పారు. మోక్షజ్ఞ తొలి సినిమా కోసం మరో రెండేళ్లు ఎదురుచూపులు అంటే ఈ వార్త అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని బాలయ్య ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు “ఆదిత్య 999 మాక్స్‌” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఫైనల్ కాలేదని తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. సీక్వెల్ లో బాలయ్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తారని అయితే మెయిన్ హీరో మాత్రం మోక్షజ్ఞ అని సమాచారం. ఈ మూవీలో మోక్షజ్ఞ సూపర్ హీరో తరహా పాత్రను చేయనున్నారు.

 

లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమాను తెరకెక్కించనున్నామని బాలయ్య వెల్లడించారు. బాలయ్య ఈ మూవీలో ఏ పాత్రలో నటిస్తారో తెలియాల్సి ఉంది. బాలయ్య డైరెక్షన్ వైపు కూడా దృష్టి పెట్టడంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus