నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లుగా బాలకృష్ణ, మోక్షజ్ఞ ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. దీంతో మోక్షజ్ఞ ప్రస్తుతం ఉన్న యువ హీరోలందరికీ పోటీగా మారడం ఖాయమని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఇండియా టుడే మ్యాగజైన్ నందమూరి బాలకృష్ణపై ఓ ప్రత్యేక ఎడిషన్ ను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్ లో బాలకృష్ణ సినీ, రాజకీయ జీవిత విశేషాలను ఎన్నింటినో వివరించింది. ఇందులో భాగంగా మోక్షజ్ఞ , తన తండ్రి గురించిన చెప్పిన విశేషాలు హాట్ టాపిక్ గా మారాయి.
బాలకృష్ణ తనను ఒక కొడుకులా కంటే.. ఓ మంచి స్నేహితుడిలా ఉంటారని చెప్పాడు. ఏ విషయంలోనూ తనపై ఒత్తిడి తీసుకురాలేదని తన కెరియర్ కి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. తన తండ్రి, తాతయ్యల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అభిమానుల అంచనాలను అందుకుంటానని ఎంతో నమ్మకంతో తెలియజేశాడు.