నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞను (Nandamuri Mokshagnya) వెండితెరపైకి తీసుకురావడంలో ఆయన స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ మోక్షజ్ఞ కోసం నాలుగైదు ప్రాజెక్టులను ఫైనల్ చేసేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మొదటగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ఒక సినిమా లాంచ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఇది డెబ్యూ ప్రాజెక్ట్ అవుతుందా లేక రెండవ సినిమా అవుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ప్రస్తుతానికి, మోక్షజ్ఞ డెబ్యూ గురించి నాగ్ అశ్విన్ (Nag Ashwin) పేరు కూడా వినిపిస్తోంది. ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్‌తో కలిసి మోక్షజ్ఞతో సినిమా చేయవచ్చని, ఇది భారీ స్థాయిలో ప్లాన్ అవుతోందని అంటున్నారు. ఒకవేళ మొదటి సినిమా కాకపోయినా, రెండో ప్రాజెక్ట్‌గా ఇది ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను మొదటిసారి తెరపైకి తీసుకురావడంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తగా ఉన్నారు.
ఇక వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘సార్’ (Sir), లక్కీ భాస్కర్’ (Luky Bhasker) వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న వెంకీతో మోక్షజ్ఞ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుందని అంచనా. ఇదే కాకుండా ఇటీవల ప్రకటించిన ‘ఆదిత్య 999’ సీక్వెల్‌లో మోక్షజ్ఞ నటించనున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ మోక్షజ్ఞకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొత్తానికి, మోక్షజ్ఞ నాలుగు సినిమాలు ముగిసిన తర్వాత బోయపాటి శ్రీనుతో (Boyapati Srinu) భారీ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ ఉంటుందట. బాలకృష్ణ కెరీర్‌లో హిట్ చిత్రాలకు సూత్రధారిగా ఉన్న బోయపాటి, మోక్షజ్ఞను తగిన స్థాయిలో ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో మోక్షజ్ఞ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని బాలకృష్ణ కోరుకుంటున్నట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే, బాలకృష్ణ తనయుడి కోసం నిశితమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అనిపిస్తోంది.