బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ!

తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినా.. రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది నటి మోనాల్ గజ్జర్. ఈ షోలో ఉన్నప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ వ్యక్తిని ప్రేమించానని.. అతడితో బ్రేకప్ అవ్వడం వలన దక్షిణాది నుండి గుజరాత్ కి వెళ్లిపోయాయని చెప్పింది మోనాల్. ఆ తరువాత ఎప్పుడూ కూడా తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. కానీ తాజాగా తన బ్రేకప్ సంగతులు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మోనాల్ మాజీ ప్రియుడి పేరు ఆర్యన్.

మలయాళంలో హీరోగా సినిమాలు చేశాడు. తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసే సమయంలో ఆర్యన్ తో డేటింగ్ చేశానని.. ఐదారేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న తరువాత 2016లో బ్రేకప్ అయిందని.. ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో మళ్లీ గుజరాత్ కి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. బ్రేకప్ వలన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. అందుకే తిరిగి సౌత్ కి రాకూడదని అనుకున్నట్లు చెప్పింది. 2012లో మోనాల్, ఆర్యన్ కలిసి ‘డ్రాకులా’ అనే సినిమాలో నటించారు.

ఈ మలయాళ త్రీడీ సినిమాను తెలుగులో ‘పున్నమిరాత్రి’గా అనువదించారు. 2016లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. ఇందులో శ్రద్ధాదాస్, ప్రభు, నాజర్ లాంటి తారలు కూడా నటించారు. ఇక మోనాల్ విషయానికొస్తే.. బిగ్ బాస్ షో తరువాత బిజీగా మారిన కంటెస్టెంట్ ఎవరంటే మోనాల్ పేరే చెప్పాలి. ఓ పక్క సినిమాలు ఒప్పుకుంటూనే టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది ఈ బ్యూటీ.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus