త్వరలో రానున్న టాప్ 10 మల్టీస్టారర్ మూవీస్!

ఇటీవల కాలంలో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు తెరపైకి వస్తున్నా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోల మల్టీస్టారర్ కథలైతే కొన్ని దశాబ్దాల తరువాత పుట్టుకొస్తున్నాయి. ఈ జనరేషన్ స్టార్ హీరోలు లిమిట్స్ ను దాటేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మన సౌత్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయి. ఒకసారి ఆ లిస్ట్ లోకి వెళితే.

మెగా నందమూరి కాంబో..

మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా RRR. ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికే రావాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.

మరోసారి వెంకీ, వరుణ్

వరుణ్ తేజ్, వెంకటేష్ మరోసారి కలిసి నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ F3. F2 ఫ్రాంచైజ్ ను వాడుకుంటూ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్ స్టార్ తో బల్లాల దేవా

ఇక రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చిన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ గట్టిగానే ఉండబోతున్నాయి. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రాబోతోంది.

మరోసారి మెగా కాంబో

ఇక మెగాస్టార్ మలయాళం లూసిఫర్ రీమేక్ ను రామ్ చరణ్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని నిర్మించడమే కాకుండా రామ్ చరణ్ అందులో స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.

వెంకీతో చెర్రీ

ఇక లైసెన్స్ అనే మరో సినిమా యొక్క తెలుగు రీమేక్ రైట్స్ అందుకున్న రామ్ చరణ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా కోసం దర్శకుడిని వెతుకుతున్నట్లు టాక్.

ఆర్య & కలైరసన్ కాంబో..

కబాలి, కాలా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు పా.రంజిత్ నెక్స్ట్ ఒక పీరియాడిక్ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సర్పత్తా పేరంబై అనే ఆ సినిమా కూడా వచ్చే ఏడాది ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1980ల కాలంలోని బాక్సింగ్ నేపథ్యంలో సినిమా తెరక్కనుందట.

కామెడీ మల్టీస్టారర్

 

కామెడీ మల్టి స్టారర్ సినిమాలు కూడా తమిళ్ లో బాగానే వస్తున్నాయి. త్వరలో జై, రెజీనా, సత్యరాజ్, రమ్య కృష్ణ, నాసర్ వంటి అగ్ర నటీనటులు నటించిన పార్టీ అనే కామెడీ సినిమా రాబోతోంది.

అగ్ర తారలతో మణిరత్నం

 

దర్శకుడు మణిరత్నం తన కెరీర్ లో మొదటిసారి బాహుబలి రేంజ్ లో ఒక బిగ్ బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమాని చేస్తున్నాడు. అందులో .విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, జయం రవి, త్రిష వంటి అగ్ర తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మాస్టర్‌లో విజయ్ & విజయ్ సేతుపతి

కోలీవుడ్ ఆడియెన్స్ ను లాక్ డౌన్ ముందు నుంచి ఊరిస్తున్న సినిమాల్లో మాస్టర్ ఒకటి. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మొదటి సారి విజయ్ సేతుపతి ఒక పవర్ఫుల్ పాత్రలో నటించాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సిద్దార్థ్, శర్వా మహా సముద్రం

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా మహా సముద్రం. సిద్దార్థ్, శర్వానంద్ నటిస్తున్న ఈ మినీ మల్టీస్టారర్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. చాలా కాల తరువాత సిద్దార్ట్ ఒక తెలుగు సినిమా చేస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus