మరో రోజులో 2025 అయిపోతోంది.. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏమైందో చూసుకోవడం లాంటివి చేయాలి కదా. సినిమా అభిమానులుగా మనకు సినిమా వసూళ్లే పెద్ద విషయం. ఆ లెక్కన ఈ ఏడాది అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా ఏంటో తెలుసుకోవాలి కదా.. ఇప్పుడు అదే చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా, అలాగే మన దేశంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా ఏంటో కూడా చూద్దాం.
మన దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమా అంటే.. ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్ – ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1100 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాదే ఈ ఏడాది టాప్ ప్లేస్. దేశభక్తి, యాక్షన్ టచ్ ఇచ్చి రూపొందించిన ఈ సినిమా తొలి రోజు రూ.26కోట్లు వసూళ్లు అందుకుంది. అది చూశాక ఇంత వసూళ్లు వస్తాయని ఎవరూ ఊహించరు. కానీ ఆదిత్య ధర్ – రణ్‌వీర్ మ్యాజిక్ అదిరిపోయింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాబడి అందుకున్న సినిమా విషయానికొస్తే.. ‘నే జా 2’ గురించి చెప్పాలి. చైనాకు చెందిన ఈ యానిమేషన్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 2.2 బిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. మన కరెన్సీలో చూస్తే దాదాపు రూ.19 వేల కోట్లు. ఈ సినిమాకు బడ్జెట్ రూ.700 కోట్లు పైమాటే. ఇక లెక్కేసుకోండి సినిమా ఎంత లాభాలు పొందిందో. ఇక మన దేశంలోనూ ఓ యానిమేషన్ సినిమా అదరగొట్టింది. అదే ‘మహావతార్ నరసింహ’. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.320 కోట్లకుపైగా అందుకుంది.
ఇన్ని వివరాలు చెప్పి టాలీవుడ్ అత్యధిక వసూళ్ల చిత్రం గురించి కూడా చెప్పలి కదా. ఈ సారి మన పరిశ్రమ నుండి ఆశించిన భారీ విజయాలు రాలేదు. వపన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మాత్రమే రూ.300 కోట్ల మార్కును చేరుకున్నాయి. ఆ లెక్కనే వీరే హయ్యెస్ట్.