Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక జంటగా తొలిసారిగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. అయితే ఆ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంత ఇంతా కాదు. ఆ మూవీ చేస్తున్న సమయంలోనే ఈ జంట ప్రేమలో పడ్డట్లు అప్పట్లో నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తరువాత వీరిద్దరూ జంటగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ వీరిరువురి సాన్నిహిత్యం అలానే కొనసాగుతూ వస్తుంది.
ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా అక్టోబర్ లో ఈ మధ్యనే విజయ్ – రష్మిక ల ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ, సన్నిహితుల ద్వారా ఈ సంగతి మీడియా లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం, వీరి వివాహా తేదీకి సంబందించిన ఒక విషయం ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే ..
విజయ్ – రష్మిక ల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రముఖ సెలెబ్రెటీలు వివాహాలు జరుపుకున్న వేదిక అయిన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండగా , అటు విజయ్ నుంచి కానీ ఇటు రష్మిక నుంచి కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.