అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయ్యింది.మొదట కొంత మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది.
ఓసారి ఆ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 7.35 cr |
సీడెడ్ | 3.90 cr |
ఉత్తరాంధ్ర | 2.28 cr |
ఈస్ట్ | 1.18 cr |
వెస్ట్ | 0.95 cr |
గుంటూరు | 1.34 cr |
కృష్ణా | 1.07 cr |
నెల్లూరు | 0.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.87 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.79 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 22.66 cr |
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటివారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.22.66 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు 1.66 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?