Most Eligible Bachelor Collections: ‘బ్యాచిలర్’ బ్రేక్ ఈవెన్ కు ఎంత రాబట్టాలంటే..!

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది.టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం… ఇటీవల విడుదలైన లెహరాయి పాట చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. దాంతో పాటు దసరా సెలవులు కూడా ఈ చిత్రానికి కలిసొచ్చాయి.ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 6 ఏళ్ళ నుండీ ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు మొదటి హిట్ పడేలా చేసాయి.

ఇక ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 5.41 cr
సీడెడ్ 2.94 cr
ఉత్తరాంధ్ర 1.67 cr
ఈస్ట్ 0.86 cr
వెస్ట్ 0.70 cr
గుంటూరు 1.03 cr
కృష్ణా 0.79 cr
నెల్లూరు 0.61 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.12 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 17.23 cr

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.17.24 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.77 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus