Vidudala: మంచి సినిమా.. అందుకే ఇలా అయ్యింది..!

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్… తన ‘గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ పై పక్క భాషల్లో రూపొందిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ సినిమాని రిలీజ్ చేశారు. అది పెద్దగా ఆడలేదు. తర్వాత రిలీజ్ చేసిన ‘కాంతార’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సాధించింది. దీంతో ఆయన ‘తోడేలు’ అనే మరో డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేశారు. అది కూడా పెద్దగా ఆడలేదు.

ఇప్పుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన (Vidudala) ‘విడుదలై -1’ చిత్రాన్ని తెలుగులో ‘విడుదల -1’ పేరుతో రిలీజ్ చేశారు. భాషతో సంబంధం లేకుండా దర్శకుడు వెట్రిమారన్ సినిమాలను అందరూ చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అదే నమ్మకంతో ‘విడుదల-1’ ని అల్లు అరవింద్.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా చూస్తే చలించని వ్యక్తి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అంత నేచురల్ గా ‘విడుదల-1’ ని వెట్రిమారన్ తీర్చిదిద్దాడు.

అట‌వీ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కథలో… గిరిజ‌నుల‌పై పోలీసుల జులూంని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. పోలీసులు గిరిజన మహిళల పై చేసే దాడి చాలా ఘోరంగా అనిపిస్తుంది. అప్పట్లో నిజంగానే అలా జరిగుండొచ్చేమో.. అనిపించేలా మనల్ని ఆ వరల్డ్ కి తీసుకుపోయాడు వెట్రిమారన్. అయితే ముందుగా అనుకున్నట్టే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు అని చెప్పాలి.

‘విడుదల-1’ రూ.1.5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్టు. కానీ 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.70 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొదటి పార్ట్ ఇలాంటి రిజల్ట్ తో సరి పెట్టుకున్నప్పుడు రెండో పార్ట్ విడుదల చేసే అవకాశాలు ఉంటాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus