కరోనా 2.0 విలయతాండవం సృష్టిస్తుంది. ఇండియా వైడ్ రోజుకి 2 లక్షల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10వేలకు పైనే కేసులు నమోదవుతుండడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది.కరోనా నుండీ కోలుకుంటున్న వారి సంఖ్య బాగానే ఉన్నప్పటికీ కేసులు ఎక్కువవుతుండడం వలన సరైన వైద్యం అందక మరణించేవారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కూడా మళ్ళీ అయోమయంలో పడింది. ఇదిలా ఉండగా.. ఈరోజు థియేటర్ యాజమాన్యం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.
రేపటి నుండీ కొన్నాళ్ల పాటు తెలంగాణలోని థియేటర్లను మూసివెయ్యబోతున్నారట. పరిస్థితి చెయ్యి దాటాక మునుపే జాగ్రత్త పడితే మంచిదని వారు భావిస్తున్నారు. ఒక్క ‘వకీల్ సాబ్’ ప్రదర్శింపబడుతున్న థియేటర్లు తప్ప.. మిగిలిన థియేటర్ లు మూతపడనున్నాయి. ‘వకీల్ సాబ్’ ప్రదర్శింపబడే థియేటర్లు కూడా 50శాతం ఆకుపెన్సీతోనే రన్ అవుతాయట. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్నీ వాయిదా పడుతున్నాయి.
అంతేకాదు సినిమా షూటింగ్లు కూడా 50మంది క్రూతోనే జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సినీ పరిశ్రమ అనుకుని సంతోషించేలోపే కరోనా మళ్ళీ తన పంజా విసురుతుంది అని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!