‘బాహుబలి 2’ నుండి ‘కార్తికేయ 2’ వరకు.. సౌత్ లో కమర్షియల్ సక్సెస్ అందుకున్న సినిమాల లిస్ట్..!

ఓ సక్సెస్ ఫుల్ సినిమా కథ లేదా.. ఆ సక్సెస్ ఫుల్ సినిమాలోని పాత్రలను తీసుకుని..మరో సినిమాగా రూపొందించడాన్ని సీక్వెల్ అని అంతా అంటుంటారు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను సౌత్ లో కూడా పలు సినిమాలకు అప్లై చేశారు కానీ మొదట ఫలితాలు అనుకున్న విధంగా రాలేదు.అందుకు సీక్వెల్స్ ను బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీలయ్యారు. అయితే తర్వాత… తర్వాత కొన్ని కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి.కథ, కథనాలు బాగుంటే సినిమా ఫలితానికి ఢోకా ఉండదు అని కొన్ని నిరూపిస్తే మరికొన్ని మాత్రం క్రేజ్ వల్ల ఆదేశాయి. ఈ లిస్ట్ లో టాలీవుడ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి.. పక్క భాషల్లో రూపొందిన సినిమాలు ఎన్నున్నాయి అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) బాహుబలి 2 :

‘బాహుబలి 1’ కి కొనసాగింపుగా రాజమౌళి నిర్మించిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది.

2) ఎఫ్3 :

ఈ మధ్యనే వచ్చిన ‘ఎఫ్3’ మూవీ ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా రూపొందింది. ‘ఎఫ్2’ అంత కాకపోయినా ఈ మూవీ కూడా బాగానే ఆడింది.

3) ముని :

రాఘవ లారెన్స్ నటించి డైరెక్ట్ చేసిన ‘ముని’ మంచి హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా తీసిన ‘కాంచన’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

4) సింగం :

సూర్య – హరి కాంబినేషన్లో వచ్చిన ‘సింగం’ హిట్ అయ్యింది. తర్వాత ‘సింగం 2’ కూడా సక్సెస్ అందుకుంది. కానీ ‘సింగం3’ మాత్రం సక్సెస్ అందుకోలేదు.

5) 2.ఓ :

శంకర్ – రజినీ కాంత్ కాంబినేషన్లో రూపొందిన ‘రోబో’ సూపర్ హిట్ అవ్వగా.. ‘2.ఓ’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. అనుకున్న టైంకి రిలీజ్ చేసి ఉంటే ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అయ్యేది

6) దృశ్యం 2 :

వెంకటేష్ హీరోగా రూపొందిన ‘దృశ్యం’ 2014 లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. దీనికి కొనసాగింపు గా వచ్చిన ‘దృశ్యం 2’ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది

7) బంగార్రాజు :

నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సూపర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు’ కూడా సక్సెస్ అయ్యింది.

8) కె.జి.ఎఫ్ 2 :

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన ‘కె.జి.ఎఫ్ 2’ కూడా మంచి సక్సెస్ అందుకుంది.

9) కార్తికేయ2 :

నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన ‘కార్తికేయ2’ తెలుగుతో పాటు హిందీలో కూడా విజయాన్ని అందుకుంది.

10) గంగ, కాంచన 3 :

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ‘ముని’ కి సీక్వెల్స్ గా వచ్చిన ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నాయి. ‘కాంచన 3’ కి ప్లాప్ టాక్ వచ్చిన సూపర్ హిట్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus