సహజంగా మన నాయకులు సినీ పరిశ్రమని ఉద్దరిస్తాం, వారికి ప్రత్యేక రాయతీలు కల్పిస్తాం, ఇక్కడే సినిమాలు తీసుకోండి, ఇక్కడే షూటింగ్స్ చేసుకోండి అంటూ, సినీ వేదికలపై ఎన్నో వాగ్ధానాలు చేస్తూ పాపం అమాయకపు సినిమా వాళ్ళని బురిడీ కొట్టిస్తూ ఉంటారు. అయితే నాయకుడు అంటేనే నాలుకకు నరం లేని వాడు అని పెద్దలు ఊరికినే అనలేదుగా. సరే ఈ స్టోరీ అంతా ఎందుకంటే సినిమా పరిశ్రమను ఉద్దరస్తాం అని డప్పులు కొట్టే నాయకుల పుణ్యమా అంటూనే సినీ పరిశ్రమ నష్టాల పాలైపోతుంది. దానికి ఉదాహరణ ప్రస్తుతం జరుగుతున్న జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలే.
దానికీ దీనికీ సంభంధం ఏంటంటే…..సంక్రాంతి బరిలో నిలిచిన బడా హీరోల సినిమాను తట్టుకోలేక తమ టాలెంట్ నే నమ్ముకుని రెండు వారాల గ్యాప్ లో వచ్చిన చిన్న సినిమాలు ఏవీ కూడా కనీసం సరైన ఓపెనింగ్స్ కు కూడా నోచుకోకపోవడం నిజంగా విచారించాల్సిన విషయం. మిగిలిన ప్రాంతాల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా సినిమాల ఉనికికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన హైదరాబాద్ లో పరిస్థితి మహా గోరంగా ఉంది. నేతలు, కార్యకర్తలు, పార్టీల మద్దతు దారులు అందరు సందుల్లో ప్రచారానికి పరిమితం అయిపోగా సినిమా హల్లు అన్నీ బోసిపోతున్నాయి. మరో పక్క కొన్ని సినిమాలు అయితే అసలు విడుదల అయ్యాయా అన్న సందేహం కలిగే అంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే సినిమాల పబ్లిసిటీ కోసం హొర్డింగ్స్ పెట్టేందుకు హైదరాబాద్ మహానగరంలో ఏ ఒక్క హొర్డింగ్ ఖాళీగా లేదు, అన్నీ పొలిటికల్ పార్టీ వాళ్ల ప్రచారంతో నిండిపోయాయి. ఇక ఈ ఎన్నికల పుణ్యమా అంటూ అటకెక్కిన సినిమాల్లో యూ ట్యూబ్ మెగాస్టార్ రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, త్రిష సరికొత్త పాత్రలో భయపెట్టాలి అని చూసిన కళావతి, నయన తార అందాల ఆరబోత నేనూ రౌడీనే, మరో చిన్న చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది ఉన్నాయి. మరి నాయకులందరూ వేదికలపై హామీలు మానేసి ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తే ఎంతో మంచిది అని సగటు ప్రేక్షకుడి ఆవేదన.
Read Today's Latest
Movie News Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus