దసరాకి సందడి చేయనున్న హీరోలు వీరే

ఈ ఏడాది సంక్రాంతి జోరు ముగిసింది. వేసవి సీజన్‌ చివరి దశకు వచ్చింది.ఈ సీజన్లో వచ్చిన భాగమతి, రంగస్థలం, మహానటి వంటి సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి. ఎక్కువగా ఫెయిల్ అయ్యాయి. ఇక హీరోలు, దర్శకనిర్మాతల కన్ను దసరా సీజన్ పై పడింది. ఇంకా దాదాపు వంద రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల “అరవింద సమేత వీర రాఘవ” దసరాకే రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే బ్రేక్స్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” తెరకెక్కుతోంది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది కూడా దసరాకే థియేటర్లో సందడి చేయనుంది.

రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘హలో గురూ ప్రేమ కోసమే జీవితం’ కూడా దసరాకే వస్తోంది. త్రినాథ్‌ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పండుగకి రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున, నానిల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరాకి రానుంది. అలాగే యువ హీరో శర్వానంద్‌, సాయి పల్లవి జంట గా చేస్తున్న “పడి పడి లేచె మనసు” దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు వారాల వ్యవధిలో ఈ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో దేనిని ప్రేక్షకులు హిట్ చేస్తారో ఇప్పుడే చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus