కధలు రాయడం ఎంత కష్టమో ప్రతీ రచయితను అడిగితే చెబుతారు. తమ కలం నుంచి జాలువారే ఎన్నో కధలకు ప్రాణం పోయడానికి ఒక రచయిత ఎంత ప్రసవ వేదన అనుభవిస్తారో వారికే తెలుస్తుంది. అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కధలు నవలల నుంచి ప్రాణం పోసుకున్నాయి. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే పెద్దగా ఆ నవలా ఆధారిత కధలు లేవు కానీ…ఒకప్పుడు నవలలే ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కేవి…అదే క్రమంలో భారీ హిట్స్ కూడా అయ్యేవి. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో నవల ఆధారంగా తెరపైన ఆవిష్కరించబడిన సినిమాలో కొన్నింటిపై ఒక లుక్ వేద్దాం రండి….
ఏప్రిల్ 1 విడుదలప్రముఖ దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ నవల ‘హరిశ్చంద్రుడు-అబద్డమాడితే’ నుంచి స్పూర్తిగా తెరకెక్కింది. అయితే ఈ నవలను రచించింది రచయిత కొలపల్లి ఈశ్వర్. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
సితారప్రముఖ దర్శకుడు వంశీ తానే స్వయంగా రచించి…తెరకెక్కించిన సినిమా సితార…అయితే ఇక్కడ ట్విష్ట్ ఏంటి అంటే ఈ సినిమా ‘మహాలో కోకిల’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆ నవలను రచించింది కూడా వంశీ కావడం విశేషంగా చెప్పవచ్చు.
జ్యోతి లక్ష్మిమల్లాది వెంకట కృష్ణ మూర్తి నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం జ్యోతి లక్ష్మి…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా…చార్మికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అని చెప్పవచ్చు.
మిధునంప్రముఖ నటుడు…రచయిత అయినటువంటి తనికెళ్ళ భరణి రచించి తెరకెక్కించిన మిధున సినిమా, ప్రముఖ రచయిత రమణ రచించిన మిధునం నవలా ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.
అభిలాషచిరంజీవి హీరోగా నటించిన అభిలాష సినిమా ప్రముఖ రచయిత యండమూరి రచించిన ‘అభిలాష’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అయితే యండమూరి రచించిన ఎన్నో నవలలు సినిమాలుగా తెరకెక్కాయి.
ఛాలెంజ్చిరంజీవి హీరోగా నటించిన ఛాలెంజ్ సినిమా ప్రముఖ రచయిత యండమూరి రచించిన ‘డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. యండమూరి రచించిన ఎన్నో నవలలలో ఈ నవల కూడా సినిమా రూపంలో మంచి పేరు తెచ్చిపెట్టింది.
అహా నా పెళ్ళంటరాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన అహా నా పెళ్ళంట… సినిమా ప్రముఖ రచయిత ఆది విష్ణు రచించిన సత్య గారి ఇల్లు నవల ఆధారంగా తెరకెక్కింది.
చంటబ్బాయ్చిరంజీవి హీరోగా నటించిన చంటబ్బాయ్ సినిమా ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన ‘చంటబ్బాయ్’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది.
జ్యో అచ్యుతానందనారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శ్రీనివాస్ అవసరాల బుచ్చిబాబు…’చివరికి మిగిలేది’ అనే నవలా ఆధారంగా తెరకెక్కింది. అంతేకాదు దేవరకొండ బాల గంగాధర్ తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి నవల యొక్క ప్రభావం సైతం ఈ సినిమాపై ఉంది.
అ..ఆమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారి ‘మీన’ నవల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అ..ఆ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది.