తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అత్యధిక షేర్ కలెక్షన్లు రాబట్టిన 15 సినిమాల లిస్ట్..!

  • April 23, 2022 / 04:46 PM IST

ఒకప్పటిలా ఇప్పటి సినిమాలు 100 రోజులు ఆడే పరిస్థితి లేదు. అప్పట్లో 10 మందిలో ఒకరి దగ్గర సెల్ ఫోన్ ఉండేది. వాళ్ళనే మనం గొప్ప వాళ్ళుగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు 100 లో ఒకరి ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఇప్పుడు ఫోన్లోనే ప్రపంచం కనిపిస్తుంది. పైగా ఓటిటిల కాలం.ఓ పెద్ద సినిమా డిజిటల్ రైట్స్ ను కోట్లకి కోట్లు పెట్టి కొంటున్నాయి అమెజాన్ ప్రైమ్ వంటి పలు సంస్థలు. వాళ్ళు ఎంత పెద్ద సినిమాని అయినా 4 వారాల్లోనే డిజిటల్ రిలీజ్ చేయాలని చూస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకుడు థియేటర్ కు రావాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాడు.

కాబట్టి ఎటువంటి సినిమా అయినా సరే మొదటి వారం వరకే థియేటర్లలో జోరు ప్రదర్శిస్తుంది. మొదటి వారం సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టడానికి చూస్తుంటారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. అందుకే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. ఆ తర్వాతి వారం ఇంకో కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే దానికి థియేటర్లు సమర్పించుకోవాల్సిందే. సరే ఇక అసలు మేటర్ కు వద్దాం.. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఏంటో. అవి ఎంత కలెక్ట్ చేశాయో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.186.36 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.

2) బాహుబలి2 :

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.117.48 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.

3) అల వైకుంఠపురములో :

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.88.25 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.

4) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.84.82 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.

5) సైరా :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.84.49 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.

6) సాహో :

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.75.67 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 71.32 కోట్ల షేర్ ను రాబట్టింది.

8) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.66.31 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) కె.జి.ఎఫ్ 2 :

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.65.05 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ కన్నడ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.

10) పుష్ప :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.64.25 కోట్ల షేర్ ను రాబట్టింది.

11) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.61.35 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డ్ ను సృష్టించింది.

12) అరవింద సమేత :

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.60.68 కోట్ల షేర్ ను రాబట్టింది.

13) మహర్షి :

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.59.36 కోట్ల షేర్ ను రాబట్టింది.

14) రంగస్థలం :

రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.58.26 కోట్ల షేర్ ను రాబట్టింది.

15) భరత్ అనే నేను :

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ.50.34 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus